twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అజ్ఞాతవాసి’కి డబ్బులు గుంజేందుకే: పవన్-కేసీఆర్ భేటీపై కామెంట్స్

    By Bojja Kumar
    |

    Recommended Video

    పవన్-కేసీఆర్ భేటీపై.. కత్తి దారుణమైన కామెంట్స్..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ అధినేత హోదాలో 2018 న్యూఇయర్ ప్రారంభం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు మర్యాద పూర్వకంగా కలిశానని పవన్ కళ్యాణ్ తెలిపారు. కేసీఆర్ పాలన ఎంతో బావుందని, రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు ఎన్నో పథకలు విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అయతే పవన్ కళ్యాణ్-కేసీఆర్ కలయిక వెనక అజ్ఞాతవాసి కోణం ఉందని యాంటీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

     యాంటీ ఫ్యాన్స్ ఆరోపణలు

    యాంటీ ఫ్యాన్స్ ఆరోపణలు

    పవన్-కేసీఆర్ భేటీ వెనక ‘అజ్ఞాతవాసి' సినిమా కోణం ఉందని, తెలంగాణ ప్రాంతంలో ప్రీమియర్ షోలు, స్పెషల్ షోలు వేసి భారీగా వసూళ్లు రాబట్టే ప్రయత్నంలో భాగమే ఇది అని కొందరి ఆరోపణ. అయితే ఇది పవన్ కళ్యాణ్ అంటే గిట్టని యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న దుష్ప్రచారమే అంటూ... ఈ ఆరోపణలను పవర్ స్టార్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.

     మరోసారి రెచ్చిపోయిన మహేష్ కత్తి

    మరోసారి రెచ్చిపోయిన మహేష్ కత్తి

    పవన్ కళ్యాణ్ మీద కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్న మమేష్ కత్తికి కూడా.... మరోసారి కామెంట్లతో రెచ్చి పోవడానికి ఈ భేటీ కారణం అయింది. ‘‘ప్రగతి భవన్ లో పవన్ కళ్యాణ్ పడిగాపులు. ముఖ్యమంత్రికి న్యూ ఇయర్ విషస్ చెప్పడానికా? అజ్ఞాతవాసి ప్రీమియర్ల పర్మిషన్ కా?''... అంటూ మహేష్ కత్తి విమర్శించారు.

     మహేష్ కత్తి కామెంట్లు కక్ష పూరితంగా ఉన్నాయి

    మహేష్ కత్తి కామెంట్లు కక్ష పూరితంగా ఉన్నాయి

    ‘‘తెలంగాణాలో 24 గంటల పవర్ ఎలా వస్తోందో తెలుసుకున్న పవర్ స్టార్...అబ్బా!! పవర్ సర్ప్లస్ ఉంటే వస్తుంది. లేదా వేరే స్టేట్ నుంచి కొనుక్కుంటే వస్తుంది. లేదా ఆంధ్రప్రదేశ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టులో భాగం అయితే ఉంటుంది. దీనికి ఒక పాలసీ స్టడీ. సరేగానీ, అజ్ఞాతవాసి ప్రీమియర్ షోస్ ఎన్ని పడతాయో చెప్పు బ్రదర్ ఆఫ్ మెగాస్టార్ !'' అంటూ మహేష్ కత్తి చేసిన కామెంట్ల విమర్శల్లా లేవని, కావాలని కక్ష పూరితంగా చేసినట్లు ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

     డబ్బులు లాగేందుకే అంటూ దారుణమైన కామెంట్స్

    డబ్బులు లాగేందుకే అంటూ దారుణమైన కామెంట్స్

    "తెలంగాణాలో నా బలం నాకుంది" - పవన్ కళ్యాణ్. నిజమే నైజాం ఏరియా టోటల్ కలెక్షన్స్ లో 50% ఉంటుంది. ముఖ్యంగా హైప్ చేసి హైదరాబాద్ లో ప్రీమియర్ల పెడితే టికెట్టుకి 3,000 నుంచీ 5,000 లాగొచ్చు. అంత బలం ఉంది. ఆ బలానికి బలగం తోడు అవ్వాలంటే, కె.సి.ఆర్ అనుగ్రహం కావాలి. భేష్!"..... అంటూ మహేష్ కత్తి మరోసారి దారుణమైన కామెంట్స్ చేశారు.

     పవన్ కళ్యాణ్ మనోడే: కేసీఆర్

    పవన్ కళ్యాణ్ మనోడే: కేసీఆర్

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. వపన్ కళ్యాణ్ మన వ్యక్తే అని.. ఇకపై పవన్ ను బాగా చూసుకోండని టీఆర్ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు.

     అజ్ఞాతవాసి

    అజ్ఞాతవాసి

    పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. అనిరుధ్ రవించదర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మాత.

    English summary
    Telangana Chief Minister K Chandrasekhar Rao and actor-politician Pawan Kalyan met each other on Monday at the former's camp office in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X