»   » ‘సాయిధరమ్‌’తో పవన్ కల్యాణ్ అప్‌సెట్.. అర్ధరాత్రి ఫోన్ చేసి క్లాస్.. ఎవరికో తెలుసా

‘సాయిధరమ్‌’తో పవన్ కల్యాణ్ అప్‌సెట్.. అర్ధరాత్రి ఫోన్ చేసి క్లాస్.. ఎవరికో తెలుసా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pawan Kalyan Fix Sai Dharam Tej's Next Director

కెరీర్ ఆరంభంలో మెగా హీరోల్లో మెరుగ్గా కనిపించిన సాయిధరమ్ తేజ్ ఈ మధ్యకాలంలో తడబడుతున్నాడు. వరుసగా సినిమాలు పరాజయం పొందడంతో సాయిధరమ్ తేజ్ సందిగ్ధంలో పడ్డాడు. అయితే వరుస ఫ్లాప్‌లతో డీలా పడిన మెగా మేనల్లుడికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అండగా నిలిచారనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 వరుస ఫ్లాపులతో సాయిధరమ్ తేజ్

వరుస ఫ్లాపులతో సాయిధరమ్ తేజ్

ఆరంభంలో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి సినిమాలతో సాయిధరమ్ దూసుకెళ్లాడు. ఆ తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దాంతో సాయిధరమ్ తేజ్ డిఫెన్స్‌లో పడినట్టు కనిపించాడు.

సాయిధరమ్ తేజ్‌కు వ్యతిరేకంగా

సాయిధరమ్ తేజ్‌కు వ్యతిరేకంగా

తాజాగా విడుదలైన ఇంటిలిజెంట్ సినిమా కూడా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో సాయిధరమ్ తేజ్‌కు వ్యతిరేకంగా సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సాయిధరమ్ తేజ్‌కు పవన్ కల్యాణ్ అండగా నిలిచినట్టు తెలిసింది.

 రంగంలోకి పవన్ కల్యాణ్

రంగంలోకి పవన్ కల్యాణ్

సాయిధరమ్ తేజ్‌ తదుపరి సినిమా సక్సెస్ అయ్యేలా చూడటం కోసం పవన్ రంగంలోకి దిగినట్టు మీడియాలో ప్రచారం జరుగుతున్నది. సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం కరుణాకరన్‌తో జరుగుతున్న సంగతి తెలిసిందే.

 అర్ధరాత్రి కరుణాకరన్‌కు ఫోన్

అర్ధరాత్రి కరుణాకరన్‌కు ఫోన్

కరుణాకరన్‌కు అర్ధరాత్రి ఫోన్ చేసి కథపై గురించి తీవ్రంగా చర్చించారట. ఇటీవల సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్ర కథ ఏమిటనే విషయాన్ని తెలుపాలని కోరినట్టు సమాచారం.

 ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి..

ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి..

సాయిధరమ్ తేజ్ మూవీ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ అందించాలని, ఏదో మొక్కుబడిగా సినిమా తీయవద్దని కరుణాకరన్‌కు పవన్ సూచించినట్టు తెలిసింది. సాయిధరమ్ తేజ్‌కు తప్పనిసరిగా హిట్ అందించాలని చెప్పినట్టు తెలిసింది.

సాయి ఖాతాలో హిట్ పడాలి

సాయి ఖాతాలో హిట్ పడాలి

పవన్, కరుణాకరన్ కాంబినేషన్‌లో వచ్చిన తొలిప్రేమ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాంటి చిత్రమే సాయిధరమ్ తేజ్ ఖాతాలో పడేలా పవన్ చర్యలు తీసుకొంటున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

అనుపమ పరమేశ్వరన్‌తో

అనుపమ పరమేశ్వరన్‌తో

కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్‌ సరసన అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు రూపొందిస్తున్నారు.

English summary
After Intelligent movie flop, Mega hero Sai Dharam Tej situation become is very bad. After five consecutive flops, he was upset. In this situation, His uncle Pawan kalyan stood for Sai Dharam Tej. Pawan spoke to Director Karunakaran who is Sai's next director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu