»   » 'ఖైదీ నంబర్ 150': ప్రి రిలీజ్ పంక్షన్ కు పవన్ డుమ్మా కొట్టే ఉద్దేశంతోనే అలా?...అదా కారణం

'ఖైదీ నంబర్ 150': ప్రి రిలీజ్ పంక్షన్ కు పవన్ డుమ్మా కొట్టే ఉద్దేశంతోనే అలా?...అదా కారణం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తొమ్మిదేళ్ల సుధీర్గ విరామం తరువాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ కు ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్‌ వస్తాడా రాడా అన్న విషయం సినీ వర్గాలు, అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ వేడుకను శనివారం గుంటూరు... హాయ్ లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఫంక్షన్‌కు తమ్ముడు పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టడం ఖాయమైనట్లే అంటున్నారు. అందుకు నిదర్శనంగా పవన్ తన అన్నా, వదినలను, రామ్ చరణ్ లను ఉద్దేశించి విషెష్ చెప్తూ చేసిన ట్వీట్ ని చూపెడుతున్నారు.'చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న మొదటి చిత్రం అన్నయ్య నటించిన ఖైదీ నెం 150 కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు' అంటూ విషెస్ తెలిపారు. పవన్ కు వచ్చే ఉద్దేశ్యమే ఉంటే ..ఈ ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముందని, స్టేజిమీదే విషెష్ చెప్పచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.


తన అన్నపైనే ఫోకస్ ఉండాలని

తన అన్నపైనే ఫోకస్ ఉండాలని

అలాగే పవన్ పక్కా వస్తాడని భావించిన ఈ ఫంక్షన్‌కు చివరినిమిషంలో హ్యాండ్ ఇవ్వడానికి అసలు కారణమంటూమీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కాటమరాయుడు షూటింగ్ ఉండటం పెద్ద అడ్డంకి కాదని.. అన్నయ్య ప్రతిష్టాత్మక సినిమాలో ఫ్యాన్స్ ఫోకస్ అంతా చిరంజీవిపైనే ఉండాలని భావించి రాలేదని.. తాను కార్యక్రమానికి హాజరైతే ఫోకస్ డివైడ్ అవుతుందని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఫంక్షన్‌కు హాజరుకాకూడదనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు తెలుస్తోంది.


అల్లు అర్జున్ సైతం

అల్లు అర్జున్ సైతం

ఇప్పటికే మెగా క్యాంప్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లు తాము మెగా ఈవెంట్ కు హాజరయ్యేందుకు షూటింగ్ వాయిదా వేసుకున్నామని అన్నారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు.ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా ఎదురుచూస్తున్న ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.


సక్సెస్ ఈవెంట్..

సక్సెస్ ఈవెంట్..

మరో ప్రక్క పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో... మెగాస్టార్ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవసరమే లేదని అన్నారని ప్రచారం జరుగుతోంది. దాని బదులు రిలీజ్ తర్వాత సక్సెస్ ఈవెంట్ నిర్వహించుకుంటే బావుంటుంది కదా అంటున్నారట. ఇప్పటికే రావాల్సిందానికంటే ఎక్కువ అటెన్షన్ అన్నయ్య మూవీపై క్రియేట్ అయిందని పవన్ అభిప్రాయపడుతున్నారట.


దాసరి వస్తున్నారు

దాసరి వస్తున్నారు

మరోవైపు మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకరత్న దాసరి నారాయణరావును ముఖ్య అతిధిగా పిలిచారు. దీని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు, రాఘవేంద్రరావులు రానున్నారు.


ఫ్యాన్స్ ఆశపడుతున్నారు

ఫ్యాన్స్ ఆశపడుతున్నారు

ఇప్పటికే పక్కన బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి పోటీ ఉండటంతో పవన్ రాక మరింత కలిసొస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


మెగాభిమానులు స్వయంగా..

మెగాభిమానులు స్వయంగా..

పవన్‌ వచ్చే అవకాశం లేదని సినీ వర్గాలు చెబుతుండగా, ఆయన్ను రప్పించేందుకు మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది. బాబాయ్‌ ను కలసి ఇన్విటేషన్‌ ఇస్తానని రాంచరణ్‌ ఫేస్‌ బుక్‌ లైవ్‌లో చెప్పాడు. దీంతో పవన్‌ రాకకోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.


పవన్ కోరుకున్నారంటూ..

ఈ విషయాన్ని పవన్ క్లోజ్ ఫ్రెండ్.. కాటమరాయుడు నిర్మాత, శరత్ మరార్ తన ట్విట్టర్ ఖాతో ట్వీట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం ద్వారా భారీ సక్సెస్ కావాలని పవన్ కోరుకుంటున్నట్లు శరత్ మరార్ వెల్లడించారు.


ఏర్పాట్లు పూర్తి

ఏర్పాట్లు పూర్తి

సంక్రాంతికి విడుదలయ్యే మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీనెంబర్‌ 150 ప్రీ రిలీజ్‌ వేడకలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని హాయ్‌ల్యాండ్‌లో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ జరిగే వేడుకలకు వేదిక నిర్మాణం, బారికేడ్ల పనులు, లైటింగ్‌, సౌండ్‌సిస్టం పనులు శరవేగంగా చేస్తున్నారు


ప్రత్యేక ప్రాగణాలు

ప్రత్యేక ప్రాగణాలు

15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణానికి ఎదురుగుగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్షమందికి పైగా హాజరుకావచ్చని అంచనా వేస్తున్నారు. వేదిక ప్రాంగణంలో ఎంవీఐపీ, వీవీఐపీ, వీఐపీ ప్రాంగణాలు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించారు.English summary
Sharrath Marar is trying to convey that Pawan Kalyan is not attending for Khaidi No.150 pre-release event and he extends his wishes to the team.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu