»   » పెద్దాయనని పవన్ మరిపిస్తాడా?

పెద్దాయనని పవన్ మరిపిస్తాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇన్నాళ్లూ రాజకీయాలతో తీరిక లేకుండా గడిపారు పవన్‌ కల్యాణ్‌. ఇక నుంచి సినిమా కబుర్లతో అలరించబోతున్నారు. ఆయన ఒప్పుకొన్న రెండు సినిమాలకు సంబంధించి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత వెంకటేష్‌తో కలసి 'ఓ మై గాడ్‌' రీమేక్‌ కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు పవన్‌. ఇందులో అక్షయ్‌ పోషించిన పాత్రలో తెలుగులో పవన్‌ నటించబోతున్నారు. కృష్ణుడుగా పోషించే ఈ పాత్రపై ఇప్పటికే చర్చ మొదలైంది. కృష్ణుడు అంటే ఇన్నాళ్లూ నందమూరి తారక రామారావు. ఇప్పుడు పవన్ ఈ పాత్ర ద్వారా ఆయన్ను మరిపించగలడా అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో చర్చలు మొదలయ్యాయి. అయితే ఈ చిత్రంలో పవన్ వేసే పాత్ర మోడ్రన్ గెటప్ లో కనపడే కృష్ణుడు అనే విషయం మర్చిపోకూడదు. అందుచేత పోలిక తేకుండా ఉండటమే మేలు.

ఇక ఈ చిత్రం జూన్‌2న ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. ఆ వెంటనే చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. డాలీ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక గురించి చిత్రబృందం కసరత్తులు చేస్తోంది. 'ఓ మై గాడ్‌'లో అక్షయ్‌కుమార్‌, పరేష్‌ రావల్‌ నటించారు. ఈ మేరకు ఏర్పాట్లు మెగా స్పీడుతో జరుగుతున్నాయి. 'దేవ దేవం భజే' అనే టైటిల్ ని పవన్ ఓకే చేయటంతో ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రంలో 'దేవ దేవం భజే' ట్రాక్ ఉంది. అప్పట్లో ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి గానం చేసిన ఈ ట్రాక్ చాలా పాపులర్. దేవుడికి,భక్తుడికి చెందిన చిత్రం కాబట్టి ఈ టైటిల్ సూటయ్యే అవకాసం ఉందని భావిస్తున్నారు.

Pawan Kalyan playing Legend NTR role

అలాగే బాలీవుడ్ చిత్రాన్ని చాలా మార్చి తెలుగు నేటివిటికి తగినట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు.

గతంలో నాగార్జున ...మోడ్రన్ దేముడుగా కృష్ణా అర్జున చిత్రంలో కనిపించి ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ సమస్య పవన్ కి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా పవన్ పాత్రను చాలా పెంచుతున్నారని అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.

పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.

కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
Pawan Kalyan's next, the telugu remake of Bollywood super hit, OMG will be drastically different from the original. if a recent buzz doing the rounds in the filmnagar circles is anything to go by, then the makers have finalised the title 'Deva Devam Baje'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu