పవన్ నెక్ట్స్ డైరక్టర్ ఖరారు, ఆ రీమేక్ తోనే ముందుకు

By Srikanya

హైదరాబాద్: అపీషియల్ అని చెప్పలేం కానీ , పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం కు దర్శకుడుని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. తమిళంలో జిల్లా అనే చిత్రం డైరక్ట్ చేసిన నేశన్ ని తన తదపరి చిత్రంకు డైరక్టర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ తమిళ రీమేక్ అని చెప్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు వేదాలం.

అజిత్, శివ కాంబినేషన్ లో వచ్చిన వేదాలం చిత్రం అక్కడ రికార్డ్ లు బ్రద్దలు కొట్టింది. ఈ నేపధ్యంలో పవన్ ఈ సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం దర్శకుడుగా నేసన్ ని ఎంపిక చేసారని వినికిడి. ఈ విషయంపై తమిళ మీడియాతో నేసన్ మాట్లాడుతూ పవన్ తో డిస్కషన్స్ చేస్తున్నానని అన్నారు.

Pawan Kalyan ropes in Jilla director Neason for Telugu remake of Vedalam

తన జిల్లా చిత్రం చూపించి నేసన్ ఓ కథ చెప్పి , గత కొద్ది రోజులుగా పనవ్ తో టచ్ లో ఉంటున్నారు. అయితే పవన్ ..ముందు ఈ రీమేక్ చేయమని నేశన్ కు చెప్పి, పని ప్రారంభించమని, తెలుగు వెర్షన్ కు తగిన మార్పులు రైటర్స్ తో కూర్చుని చేయమని చెప్పారని చెప్పుకుంటున్నారు.

Pawan Kalyan ropes in Jilla director Neason for Telugu remake of Vedalam

ఈ మేరకు దర్శకుడు నేశన్...ముందు పవన్ సినిమాలు వరస పెట్టి చూస్తున్నాడట. పవన్ ని ఎలా చూపెడితే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనే విషయం అడిగి తెలుసుకుంటున్నారట. ఆ ఎలిమెంట్స్ అన్ని కలిపి వేదాలం తెలుగు వెర్షన్ కథ రెడీ చేసి పవన్ కు చెప్పి ఓకే చేయించుకుంటారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X