పవన్,త్రివిక్రమ్ కొత్త చిత్రం టైటిల్ సూపర్ గా ఉంది, విన్నారా?

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌ 'కాటమరాయుడు' మొదలై రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసింమదే. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ ఫ్యాక్షనిస్ట్ ప్రేమ కధ గా రూపొందుతోంది. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ వీరమ్ కు రీమేక్ .

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు మొదలెట్టారు పవన్. డిసెంబర్ మొదటి వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబధించిన లేటెస్ట్ అప్ డేట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అదేమిటంటే.... ఈ చిత్రానికి ఓ డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. అదే.. 'దేవుడే దిగి వచ్చినా'.

Pawan Kalyan’s Devude Digi Vachina with Trivikram?

ఈ టైటిల్ ని నాగార్జున నటించిన సంతోషం చిత్రంలోని 'దేవుడే దిగి వచ్చినా' .. పాటలోని మొదటి పదాలను టైటిల్ గా తీసుకోబోతున్నారు. పవన్ ని ఆయన అభిమానులు దేముడుగా భావిస్తూంటారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. రాథా కృష్ణ ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు సమాచారం.

ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా వున్నారు. ఈ స్క్రిప్ట్ కి ఆయన ఇదే టైటిల్ పెట్టుకున్నారని సమాచారం. ఇది ఫైనల్ అవుతుందో లేదో గానీ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఇదేనని విశ్వసనీయవర్గాల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X