»   » 'గబ్బర్‌సింగ్‌ 2' టైటిల్ వద్దనుకున్న కారణం..ఏంటి

'గబ్బర్‌సింగ్‌ 2' టైటిల్ వద్దనుకున్న కారణం..ఏంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారాబాద్: పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించటానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ కు సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతున్న ఈ చిత్రానికి 'గబ్బర్‌సింగ్‌ 2' అనే టైటిల్ పెడతారనే అనుకున్నారంతా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త టైటిల్ పెట్టినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రానికి 'సర్దార్‌' అనే పేరు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అయితే హఠాత్తుగా పనవ్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనక ఓ బలమైన కారణం ఉందటున్నారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ అంటే వచ్చే క్రేజ్ సర్దార్ అంటే రాదని కొందరు సన్నిహితులు హెచ్చిరించినా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. దానికి కారణం...లీగల్ గా టైటిల్ తో ఉన్న తలనొప్పులే అంటున్నారు.

గతంలో గబ్బర్ సింగ్ చిత్రం చేసేటప్పుడు ఆ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసిన ముంబై వారు కోర్టుకు వెళ్లారు. తర్వాత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి తలనొప్పు ఎదురుకాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సర్దార్ అన్నా బిజినెస్ అలాగే జరుగుతుందని, క్రేజ్ అలాగే ఉంటుందని పవన్ భావించినట్లు చెప్పుకుంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Pawan Kalyan's Movie titled as Sardhar

షెడ్యూల్ డిటేల్స్

ఈ నెలాఖరున మొదలయ్యే కొత్త షెడ్యూలుతో పవన్‌ కల్యాణ్‌ రంగ ప్రవేశం చేస్తారని, ఆయనపైకీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక నుంచి ఏకధాటిగా ఈ సినిమాని పూర్తి చేయాలని పవన్‌ భావిస్తున్నారట. హీరోయిన్ ఎవరనే విషయాన్నీ త్వరలోనే ధ్రువీకరిస్తారు.శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు.

ఇక 'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల మహారాష్ట్రలో తొలి షెడ్యూలు పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలెడతారు.

English summary
Pawan Kalyan’s next film Gabbar Singh 2 (working title) makers are contemplating the title ‘Sardar’ for the action drama.
Please Wait while comments are loading...