twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ అంచనాలతో విడుదల పంజాకి భారీగా సెన్సార్ కట్స్...!

    By Sindhu
    |

    పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన చిత్రం 'పంజా' గత శుక్రవారం (డిసెంబర్ 9)భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య విడుదలైన విషయం తెలిసిందే. మొదటి రోజునుండి పంజా డివైండ్ టాక్ తెచ్చుకుంది. పులి, తీన్ మార్ తర్వాత పంజా..ఇలా వరుసగా డిసాస్టర్ టాక్ తెచ్చుకుంటుంటే పవన్ అభిమానులను బాగా నిరుత్సాహానికి గురి చేసిందని తెలుస్తోంది. అసలు 'పంజా' చిత్రం ప్లాప్ అవ్వడానికి కొన్ని కారణాలు కూడా చెబుతున్నారు.

    అవేంటంటే బుల్లెట్ హడావిడి తప్ప సినిమాలో ఏమీ లేదు. హీరోయిన్స్ చాలా మైనస్, డల్ స్ర్కీన్ ప్లే....ఫస్టాఫ్ పర్వాలేదుగానీ, ..సెకండాఫ్ బాగోలేదంటున్నారు. డైరెక్టర్ కంప్లీట్ గా పెయిల్ అయ్యాడనే టాక్ ఉంది. దాని తోడు సెన్సార్ కట్స్ తో మరికొంత సినిమా రేంజ్ తగ్గిందని అంటున్నారు. ఆ సెన్సార్ కట్స్ ఏమిటంటే...

    1. రీల్ నెంబర్ 4 లో, తనికెళ్ళ భరణి చెప్పే డైలాగ్ 'రోలుకు రోకలి కావాలి కానీ.. పెన్సిల్ ఎందుకు…'
    2. రీల్ నెంబర్ 4 లో, మున్నా తన షూ తో జాహ్నవిని తొక్కిపెట్టే సన్నివేశం దాదాపు 50% కత్తిరించారు. దాంతో పాటు, మున్నాఎక్కడో చెయ్యి పెట్టుకుని 'ఫుల్ గా ఎంజాయ్ చేశావా' అనే సన్నివేశంలో, అతను చెయ్యి పెట్టుకునే కదలికను కత్తిరించారు.
    3. రీల్ నెంబర్ 6 లో, బ్రహ్మానందం చేతిలో ఉన్న మందు సిసాపై రాసి వున్నా 'ఓల్డ్ మంక్' అనే అక్షరాలను కనపడకుండా కత్తిరించారు.
    4. 'నీ అబ్బ, నీ అమ్మ, బాస్టర్డ్, ఫక్..' అనే డైలాగ్స్ ను సినిమాలో ఉన్న ప్రతి చోట కత్తిరించారు.
    5. రీల్ నెంబర్ 1 లో, ఐటెం సాంగ్ లో ఐటెం గర్ల్స్ అంతా స్నానం చేసే తొట్టిలో వుండి చూపించే 'క్లివేజ్' షోను కత్తిరించారు.
    6. రీల్ నెంబర్ 2 లో, మున్నా డ్రగ్ ఉపయోగించే సన్నివేశంలో ఉన్న కాంతిని తగ్గించారు.

    English summary
    Pawan Kalyan always tries to be different. At the beginning of his career, he was seen as style icon, but later he moved away from formula films and started focusing on out-of-the-box ideas. His huge fan following may not like him to experiment, but Pawan Kalyan is what he is. His films carry style with less space for regular commercial ingredients.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X