»   » ఇంతకీ పవన్ కళ్యాణ్ హిట్టా...ఫట్టా

ఇంతకీ పవన్ కళ్యాణ్ హిట్టా...ఫట్టా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ వర్గాల్లోనే కాక సామాన్య వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం..ఇంతకీ పవన్ కళ్యాణ్ హిట్టా..ఫట్టా అనేదే. సీమాంధ్రలో ఎన్నికలు నిన్నటితో ముగిసాయి. ఇక ఓటరు తీర్పే మిగిలింది. ఎన్టీయే కూటమి తరుపున విస్తృతంగా ప్రచారం చేసిన పవన్ తను మద్ధతు ఇచ్చిన కూటమికి ఎంతవరకూ ఉపయోగపడ్డారు..ఎంతవరకూ ఆయన ప్రభావం ఉండనుంది అనేది తెలుసుకోవాలని అంతా ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణాలో పోటీ ఇస్తే చాలు అనుకునే పరిస్దితి సీమామధ్రలో కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు నెగ్గితేనే పవన్ ప్రభావం ఉన్నట్లు. జగన్ ని అధికారంలోకి రాకుండా ఆపిందా లేదా అనే దానిపై పవన్ పవర్ ఎంతవరకూ పనిచేసిందనేది ఇప్పుడు ముఖ్యం.

ఈసారి కనుక పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా లేపోతే...వచ్చే ఎలక్షన్స్ లో పవన్ పార్టీ ఉండకపోవచ్చును అనే ఊహాగానాలు సైతం ఈ సమయంలో వినిపిస్తున్నాయి. పవన్ ఈ సారి తన ప్రభావం చూపగలిగితే ఖచ్చితంగా జనసేన పార్టీ ని అంతా సీరియస్ గా తీసుకుంటారనేది నిజం. పవన్ పవర్ పనిచేసి విజయం సాధిస్తే సరే, లేకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతోన్న మీడియావర్గం ఈ సారి మరింత విరుచుకుపడటం ఖాయం...ఎండగడుతూ కథనాలు ప్రసారం చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే ఆయన అభిమానులు సైతం తమ హీరో సినిమా విడుదల అయ్యాక రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసినట్లు చాలా ఆసక్తిగా ఎలక్షన్స్ రిజల్ట్ వైపు చూస్తున్నారు.

Pawan Kalyan's Powerful impact?

ఇక పవన్‌కల్యాణ్‌ సరాసరి కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. 'ఓ మై గాడ్‌' రీమేక్‌ సినిమా కోసం ఆయన కాల్‌షీట్లు కేటాయించినట్టు సమాచారం. మే నెలాఖరున షూటింగ్ మొదలవుతుంది. దీనికోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే ఎక్కువ భాగం సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ సెట్ ఓ మార్కెట్ సెట్. కథలో ఎక్కువ భాగం మార్కెట్ లో జరుగుతుంది కాబట్టి ఆ మార్కెట్ నే బాగా డిజైన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో పవన్‌తో పాటు వెంకటేష్‌ కూడా నటిస్తారు. హిందీలో అక్షయ్‌కుమార్‌, పరేష్‌ రావల్‌ నటించిన 'ఓ మైగాడ్‌' విజయవంతమైంది. అదే చిత్రాన్ని ఇక్కడ పవన్‌, వెంకటేష్‌లపై తీస్తున్నారు. అక్కడ అక్షయ్‌ పోషించిన పాత్రలో పవన్‌, పరేష్‌ రావల్‌ పాత్రలో వెంకటేష్‌ నటిస్తారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. తొలుత నయనతారని అనుకొన్నారు కానీ... ఆ ఛాన్స్‌ రాధిక చేజిక్కించుకొన్నట్టు తెలిసింది. వెంకటేష్ సరసన ఆమె చేయనుంది.

బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి పురాతన వస్తువులు అమ్మే షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

English summary
Pawan Kalyan has put his film assignments aside and campaign for the NDA alliance. All in all, Pawan Kalyan is making great impact on political arena in Andhra Pradesh. If the NDA front comes in power, he will become even more 'powerful' star. If not that is the hot topic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu