»   » అంతా బూతే...: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!

అంతా బూతే...: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. గతంలో గబ్బర్ సింగ్ చిత్రంలో ‘కెవ్వు కేక' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందుకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమాలో కూడా ఓ ఐటం సాంగ్ ప్లాన్ చేసారు.

దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇందుకోసం ఓ రచయితతో పాట రాయించి మంచి ఊపు ఉండే ట్యూన్ రెడీ చేసి ఫైనల్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ పంపారట. ఆ పాట విన్న పవన్ కళ్యాణ్ భగ్గుమన్నట్లు సమాచారం. ఆ పాటలో అంతా బూతు సాహిత్యం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో వేరే పాటను రాయించారట.

Pawan Kalyan's Sardaar Gabbar Singh song issue

మరో వైపు...ఈ చిత్రం కొత్త షెడ్యూల్ లో ఇగో క్లాషెష్ చోటు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి సనిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న జయనేని విన్సెంట్ తో దర్శకుడు బాబికి కొన్ని ఇగో క్లాషెష్, క్రియేటివ్ డిస్ట్రిబెన్సెలు చోటు చేసుకున్నాయని, దాంతో జయన్ విన్సెంట్ బయిటకు వచ్చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు. అయితే ఈ విషయమై పవన్ మధ్యలో వేలు పెట్టలేదని, బాబి తనకు నచ్చిన కెమెరామెన్ ఆర్దర్ ఎ విల్స్ ని తీసుకువచ్చి మిగతా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్ డిలే అవుతూ వస్తోందని అంటున్నారు.

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌.

    English summary
    Pawan Kalyan rejected Sardaar Gabbar Singh item song.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu