»   » పవన్ కళ్యాణ్ కి రోజుకి ఇంతని తీసుకుంటున్నాడు

పవన్ కళ్యాణ్ కి రోజుకి ఇంతని తీసుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ త్వరలో చేయబోతున్న చిత్రం "ఓ మైగాడ్". ఈ చిత్రానికి రెమ్యునేషన్ రోజుకు కోటి రూపాయలు అని తెలుస్తోంది. పవన్ తో కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ కావటంతో పది కోట్లు ఆఫర్ చేసారట సురేష్ బాబు. అంతేకాకుండా లాభాలలో 30% వాటా ఇవ్వనున్నారని చెప్తున్నారు. దానికి తోడు పవన్ స్నేహితుడు శరద్ మరార్ ని కో ప్రొడ్యూసర్ గా ఈ ప్రాజెక్టుకి తీసుకున్నారు. ఇలా పవన్ తమ ప్రాజెక్టులోకి తీసుకురావటానికి సురేష్ బాబు ఇచ్చిన ఆఫర్స్ ఇవి అంటున్నారు.

ఇక పవన్, వెంకటేష్ కాంబినేషన్ అంటే దాదాపు 45 కోట్లు వరకూ బిజినెస్ నడుస్తుందని భావిస్తున్నారు. 15 కోట్ల బడ్జెట్ లో చిత్రం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బిజినెస్ చేయటంలో సురేష్ బాబుని తెలుగు పరిశ్రమలో కొట్టిన వారు లేరని,కాబట్టే పవన్ కళ్యాణ్ ని తీసుకువచ్చి ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చారని చెప్పుతున్నారు. అయితే "ఓ మైగాడ్" లాంటి ఆధ్యాత్మిక అంశాలు కలిగిన చిత్రం, స్టార్ వెహికల్ తో ఏ మేరకు జనాల్లోకి వెళ్తుందనేది చూడాల్సిన అంశం. స్టార్ వెహికల్ అనేది ఆ సినిమాకు ప్లస్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.

గతంలో నాగార్జున ...మోడ్రన్ దేముడుగా కృష్ణా అర్జున చిత్రంలో కనిపించి ఆకట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ సమస్య పవన్ కి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా పవన్ పాత్రను చాలా పెంచుతున్నారని అంటున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి ఏం పేరు పెట్టే అవకాసముందే విషయమై మీడియాలో రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి 'ఓరి దేముడా'అనే టైటిల్ పెట్టే అవకాసముందని చెప్తున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయటానికి నిర్ణయించారని ఫిల్మ్ సర్కిల్సో లో వినిపిస్తోంది.

Pawan Kalyan shocking remuneration for Oh My God

పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.


కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
Pawan Kalyan is being offered Rs. 10 crore for 10 days as his remuneration for his upcoming movie “OH MY GOD”.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu