»   » పవన్, ఎస్ జె సూర్య కొత్త చిత్రం టైటిల్ ఇదేనా?

పవన్, ఎస్ జె సూర్య కొత్త చిత్రం టైటిల్ ఇదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'సర్దార్ గబ్బర్ సింగ్' గా సందడి చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వెంటనే కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే . సర్దార్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంటాడనుకున్న పవన్ వెంటనే సినిమా స్టార్ట్ చేస్తుండడం హాట్ టాపిక్ అయితే, తనకు ఒక సూపర్ హిట్, ఒక సూపర్ ఫ్లాప్ ఇచ్చిన ఎస్ జె సూర్య తో సినిమా చేస్తూండటం మరో విశేషం.

ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన కసరత్తులు మొదలైపోయాయట. ఇటీవలే ముంబయిలో సంగీత చర్చలు మొదలయ్యాయని తెలిసింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మొదటి పాట రికార్డింగ్ పూర్తైపోయింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తున్నారు. ఈ నెలాఖరులో ఈ విషయమై అఫీషియల్ న్యూస్ రావచ్చు. ఈ చిత్రాన్ని సైతం 'సర్దార్‌...' నిర్మాత శరద్ మారార్ నిర్మించనున్నారు. ఈ మధ్యనే పవన్ ఈ విషయాన్ని సైతం ధృవీకరించారు.

ఫ్యాక్షనిస్ట్ ప్రేమ కధగా రూపొందనున్న ఈ చిత్రానికి హుషారు అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది. ఎస్ జె సూర్య తో తన ఫామ్ లో హౌస్ లో పవన్ స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నట్లు సమాచారం.

Pawan Kalyan&SJ Surya's Next Husharu?

మరో 'గబ్బర్ సింగ్'కు 'సర్దార్ గబ్బర్ సింగ్' సీక్వెల్ చేసిన పవన్.. ఇప్పుడు 'ఖుషి' కి సీక్వెల్ చేయబోతున్నాడని రూమర్స్ వినపడుతున్నాయి. ఈ సినిమా లాంఛింగ్ కు దాదాపుగా రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఎందుకంటే బ్లాక్ బస్టర్ 'ఖుషీ' 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. దాంతో 'ఖుషి' విడుదలై ఈ యేడాదితో 15 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి.

అందుకే ఈ సీక్వెల్ ను ఇదే నెలలో మొదలుపెట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్న ఎస్.జె.సూర్య బృందం.. ఈ నెల 29న 'ఖుషి-2'ను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తోందట. దీంతో పవన్ వెంటనే మరో సినిమాకు శ్రీకారం చుట్టడం మెగాభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. మరి 'ఖుషి' సీక్వెల్ బాక్సాఫీసు దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

English summary
Rumours are doing rounds that the Pawan Kalyan, SJ Surya's movie may be titled 'Husharu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu