»   » బిగ్ బాస్‌తో అడుకుంటున్న పవన్ ఫ్యాన్స్... .ఈ సెలబ్రీటికే మెగా ఓట్లు!

బిగ్ బాస్‌తో అడుకుంటున్న పవన్ ఫ్యాన్స్... .ఈ సెలబ్రీటికే మెగా ఓట్లు!

Written By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో చివర వారంలోకి ప్రవేశించింది. మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ 1 విజేత ఎవరో తెలిసిపోనున్నది. ఇప్పటికే ఫైనల్ చేరుకున్న ఐదుగురు సెలబ్రిటీలు తమకు ఓట్లు వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమకు 60 రోజులకు పైగా వినోదాన్ని పంచిన ఇంటి సభ్యులకు ఓట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఓ సెలబ్రిటికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్న ఆ ఇంటి సభ్యుడు ఎవరంటే..

పవన్ కల్యాణ్ కు ఇష్టమైన వ్యక్తుల్లో...

పవన్ కల్యాణ్ కు ఇష్టమైన వ్యక్తుల్లో...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇష్టమైన వ్యక్తుల్లో శివ బాలాజీ ఒకరు. పలు చిత్రాల్లో శివ బాలాజీకి అవకాశాలు కల్పించారు. తాజాగా వచ్చిన కాటమరాయుడు చిత్రంలో పవన్ కల్యాణ్ తమ్ముడిగా నటించారు. దాంతో పవన్ కు ఇష్టమైన శివబాలాజీకి మద్దతు తెలపారని నిర్ణయించుకన్నారని సమాచారం.

పవన్‌కు శివబాలాజీ ఎంత ఇష్టమంటే..

పవన్‌కు శివబాలాజీ ఎంత ఇష్టమంటే..

పెద్దలను ఎదురించి శివబాలాజీ ప్రేమ వివాహం చేసుకొన్నప్పుడు పవన్ అండగా ఉన్నారు. వివాహా కార్యక్రమానికి స్వయంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అప్పటి నుంచి వీలున్నంత మేరకు తన సినిమాలో అవకాశాలు ఇప్పించడం, వ్యక్తిగతంగా ఇష్టపడటం చేస్తుంటాడు.

తనదైన శైలిలో రాణిస్తున్నారు...

తనదైన శైలిలో రాణిస్తున్నారు...

60 రోజుల క్రితం బిగ్ బాస్ లోకి ప్రవేశించిన శివ బాలాజీ తనదైన శైలిలో రాణిస్తున్నారు. కోపంతోపాటు దూకుడుగా వ్యవహరించడం ఆయన శైలిగా కనిపించింది. ఇంటి సభ్యుల్లో శివ బాలాజీది ప్రత్యేకమైన పంథా. తనకు నచ్చని విషయాన్ని ఎదుటి వారి ముఖంపై చెప్పడానికి వెనుకాడరు. ఇంటి సభ్యులనే కాకుండా బిగ్ బాస్ ను చెడామడా తిట్టిన సందర్భాలు తెలిసిందే.

చాప్టర్ క్లోజ్ అనుకున్నారు...

చాప్టర్ క్లోజ్ అనుకున్నారు...

మురికి నీళ్లపై స్నానం ఎలా చేస్తాం. మేం మనుషులను కాదనుకున్నారా ? లేదా గతి లేక ఈ షో కు వచ్చామా అని తీవ్ర స్థాయిలో బిగ్ బాస్ ను మందలించారు. అప్పుడే శివ బాలాజీ చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రతిసారి తప్పించుకున్నారు. దాని వెనుక పవన్ ఫ్యాన్స్ అండ ఉన్నారనే మాట వినిపిస్తోంది.

అలా కలసి వచ్చింది..

అలా కలసి వచ్చింది..

ఇంట్లో సభ్యులతో ఎన్ని గొడవలు ఉన్న భోజనం తయారు చేయడంలో... హౌస్ మేట్స్ ను జాగ్రత్తగా చూసుకోవడం శివబాలాజీకి కలిసి వచ్చింది. బిగ్ బాస్ సభ్యులకు ఎలాంటి వంటకాలనైనా చేయించి పెట్టడం ప్రేక్షకులను ఆకట్టుకొన్న అంశాల్లో ఒకటి.

ఆయన చొరవ ఆకట్టుకొన్నది...

ఆయన చొరవ ఆకట్టుకొన్నది...

బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా కూడా రెండు సార్లు చక్కగా వ్యవహరించారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా నిర్ణయాలు తీసుకోవడం శివకు కలసి వచ్చే అంశం. ఇంటి సభ్యుల మధ్య గొడవలను సద్దుమణిగించడంలో ఆయన చూపిన చోరవ ఆకట్టుకొన్నది.

రక్తి కట్టిస్తున్నాడు..

రక్తి కట్టిస్తున్నాడు..


బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించిన నాటి నుంచి శివ బాలాజీ చాలా ఫెయిర్ గా ఆటను ఆడటం గమనార్హం. భావోద్వేగాలకు అతీతంగా వ్యవహరిస్తూ పరిపూర్ణతతో కూడిన గేమ్ ను రక్తి కట్టిస్తున్నాడు. ఈ క్రమంలో విజేత రేసులో స్ట్రాంగ్ అభ్యర్థిగా శివ బాలాజీ నిలిచారు. అలాగే పవన్ ఫ్యాన్స్ అండ కూడా ఉంది అని వార్తలు వస్తున్నందున గెలుపు సులభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Bigg Boss Telugu reality show, as Junior NTR host has reached to final stage. Grand Finale will be on September 24th. In this junxture, There is rumour that Pawan Kalyan's fans are supporing to contestant Shiva Balaji. We have to wait and see what will happen on Final day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu