పవన్ కల్యాణ్‌తో పాన్ ఇండియా డైరెక్టర్ మూవీ.. దక్షిణాదిలో పాపులర్ నిర్మాత భారీ ప్రాజెక్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలోనే పాన్ ఇండియా డైరెక్టర్‌తో జతకడుతున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతున్నది. ఈ సినిమాను తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నదనే వార్త మీడియాలో క్రేజీగా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే సదరు సంస్థ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఆ నిర్మాణ సంస్థ ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే పవన్ కల్యాణ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. పార్టీని, కార్యకర్తలకు అండగా ఉండటానికి ఆయన సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓజీ చిత్రం సుమారుగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Pawan Kalyan to joins hand with Lokesh Kanagaraj for KVN Productions

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతోపాటు మరో మూవీని కూడా పట్టాలేక్కించే పనిలో ఉన్నారు. తమిళంలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొన్న లోకేష్ కనకరాజ్ గానీ.. లేదా వినోద్ గానీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే సెన్సేషనల్ న్యూస్ అధికారికంగా ప్రకటించనున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ విషయానికి వస్తే.. దక్షిణాదిలో అగ్ర నటులతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నది. ప్రస్తుతం దళపతి విజయ్‌తో జన నాయకన్, యష్‌తో టాక్సిక్, చిరంజీవితో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా, ధ్రువ సర్జా హీరోగా కేడీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమాను నిర్మించేందుకు నిర్ణయం తీసుకొన్నారు అని తెలుస్తున్నది.

More from Filmibeat

Read more about: pawan kalyan lokesh kanagaraj og
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X