»   » 'జనతా గ్యారేజ్' నిర్మాతకు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్, పవన్

'జనతా గ్యారేజ్' నిర్మాతకు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్, పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ తో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రాలు నిర్మించిన ప్రొడక్షన్ సంస్ద మైత్రీ మూవీస్. ఇద్దరు పెద్ద హీరోలుతో చిత్రాలు కావటంతో ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే ఈ బ్యానర్ పాపులర్ అయ్యిపోయింది. దానికి తగినట్లు శ్రీమంతుడు చిత్రం ఘన విజయం కలిసి వచ్చింది.

అయితే ఇదే బ్యానర్ పై త్రివిక్రమ్, పవన్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లాన్ చేసి, అడ్వాన్స్ లు ఇవ్వటం జరిగిందని సమాచారం. అయితే బయిటకురాని కొన్ని కారణాలతో వారు ఆ ప్రొడక్షన్ సంస్దకు సినిమా చేయటంలేదని అడ్వాన్స్ లువెనక్కి ఇచ్చేసారని తెలుస్తోంది. అందుకు మైత్రీ మూవీస్ దా కారణమా లేక మరేదైనానా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: 'జనతాగ్యారేజ్': నిర్మాతకు, టీమ్ కు షాక్ ఇచ్చిన మోహన్ లాల్

Pawan Kalyan, Trivikram shock Mythri Movies

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలలో పవన్ కళ్యాణ్ ...తన తదుపరి చిత్రాల్లో ఒకటి ఖచ్చితంగా త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు నిర్మాతలు మారనున్నారన్నమాట. ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇప్పుడు నితిన్ తో అ..ఆ చేస్తున్న నిర్మాత చేతికి వెళ్లే అవకాసం ఉందని సమాచారం.

గతంలో త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు మంచి విజయం సాధించాయి. అంతేకాదు త్రివిక్రమ్ కు, పవన్ కు మంచి స్నేహం కూడా ఉంది. ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ లో ఖచ్చితంగా ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవటం ఖాయం. మరి ఏ నిర్మాత దాన్ని క్యాష్ చేసుకుంటారో చూడాలి.

English summary
Pawan Kalyan and Trivikram returned their advance amount to Mythri Movie Makers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu