»   » ‘కాటమరాయుడు’ సెట్లో గొడవ, గట్టిగా అరిచిన పవన్ కళ్యాణ్?

‘కాటమరాయుడు’ సెట్లో గొడవ, గట్టిగా అరిచిన పవన్ కళ్యాణ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు షూటింగ్ శరవేగంగా జరుగుతుంటే.... అందరూ షాకయ్య న్యూస్ ఒకటి సెట్స్ నుండి లీక్ అయింది.

సెట్లో డైరెక్టర్ డాలీతో పవన్ గొడవ పడ్డాడని, ఓ సీన్ విషయంలో ఇలా జరిగిందని, దీంతో పవన్ కళ్యాణ్ ఇరిటేషన్ వచ్చి పవన్ గట్టిగా అరిచేశాడని అంటున్నారు. ఈ గొడవ వెంటనే చక్కబడ్డా మూడ్ సహకరించకపోవడంతో పవన్ అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్లిపోయాడనే ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలిదు కానీ....ఈ విషయం హాట్ టాపిక్ అయింది.


ఇక పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు ఒక డిఫరెంట్ బైక్ వాడుతుంటారు. కాటమరాయుడు మూవీలో పవన్ కళ్యాణ్ వాడే బుల్లెట్ బైక్ కు సంబంధించిన ఫోటో బయటకు లీకైంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ బైక్ వాడిన సంగతి తెలిసిందే.


ఇక డిసెంబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, వేసవి సీజన్ మొదట్లో సినిమాను విడుదల చేయాలని మొదట్నుంచీ ప్లాన్ చేసిన టీమ్, ఆ ప్రకారంగానే తాజాగా ఒక విడుదల తేదీని కూడా ఖరారు చేసింది.


పవన్ కళ్యాణ్ బైక్

పవన్ కళ్యాణ్ బైక్

ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 29, 2017న కాటమరాయుడు సినిమాను విడుదల చేయనున్నట్లు టీమ్ తెలిపింది. ఇక కాటమరాయుడు మార్చికి ఫిక్స్ అయిపోవడంతో మిగతా సినిమాలన్నీ ఎప్పుడెప్పుడు విడుదలవుతాయన్నది చూడాలి.


రీమేక్ అనే ప్రచారం

రీమేక్ అనే ప్రచారం

ఇక ఈ చిత్రం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన 'వీరమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారనేది టాక్. అయితే ఈ రీమేక్ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ అయితే చేయలేదు కానీ పవన్ లుక్ మాత్రం తెల్ల షర్ట్, పంచతో అచ్చం అజిత్ వీరంలో ఉన్నట్లే ఉంది.


క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి

క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి

అంతేకాదు... ఈ సినిమాలో హీరోయిన్.. ఒక మరదలు.. నలుగురు తమ్ముళ్ళు.. ఇలా ఆ సినిమా(వీరమ్)లో ఉన్న క్యారక్టర్లన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు చిన్న హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. అలాగే పెళ్ళిచూపులు ఫేం విజయ్.. మరో హీరో కమల్ కామరాజు.. పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.


శృతి హాసన్

శృతి హాసన్

కాటమరాయుడులో శృతిహాసన్ రెండోసారి పవన్‌కు జోడీగా నటిస్తుంది. కన్నడ నటి మానసహిమవర్ష మరో కీలక పాత్రలో కనిపించనుంది.అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.


English summary
Film Nagar source said that, Pawan Kalyan walk out from Katamarayudu sets.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu