»   » భారీగా పవన్ పబ్లిక్ మీటింగ్.. ...డిటేల్స్

భారీగా పవన్ పబ్లిక్ మీటింగ్.. ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన కొత్త పార్టీ 'జనసేన' . ఈ పార్టీ ఆ్రశయాలు ప్రచార నిమిత్తం పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు. ఈ మేరకు టూర్ ప్లాన్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. వచ్చేవారం మొదటగా వైజాగ్ లో మీటింగ్ జరగనుందని అంతర్గత వర్గాల సమాచారం. దాదాపు యాభై వేల మందికి పైగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడతారని చెప్తున్నారు. మార్చి 27న ఈ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో ఆయన ఎవరికి మద్దతు ఇచ్చే విషయం స్పష్టం చేసే అవకాసం ఉంది. అయితే ఈ విషయమై అధికారక సమాచారం పార్టీ వర్గాల నుంచి లేదు. కాబట్టి తేదీ ఖరారు కోసం వేచి ఉండాల్సిందే.

ఇక పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన కొత్త పార్టీ జనసేన తన విధానాన్ని ప్రకటించింది. సామాజిక, రాజకీయ ఎజెండాతో ముందుకు సాగే జనసేన పార్టీ సుదీర్ఘ లక్ష్యాల కోసం మాత్రమే పోరాటం చేస్తుందని వెల్లడించింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే తాత్కాలిక పార్టీ కాదని పేర్కొంది. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలనూ సెలవుదినాలుగా పాటించాలని నిర్ణయించింది.

Pawan Kalyan will start of his political public meeting

జయంతులు, వర్ధంతులు, మతపరమైన పండుగలన్నీ రాజకీయ ప్రయోజనాలకోసం సృష్టించినవే తప్ప జాతి సమగ్రత కోసం ఉద్దేశించినవి కావని జనసేన పార్టీ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయాల్లో నూతననాయకులను తయారుచేసే దిశగా పవన్‌ కల్యాణ్‌ పార్టీ విధి విధానాలను రూపొందిస్తున్నారని, సమాజంలో పునాది స్థాయినుంచి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనేది కల్యాణ్‌ లక్ష్యమని స్పష్టం చేసింది.

పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, ఇప్పటికే వందల మంది అభిమానులు, ఇతర కార్యకర్తలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్న జనసేన పార్టీ నెమ్మదిగా తమ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించింది.

English summary
Pawan Kalyan will start of his political public meetings very soon. Firstly he will be addressing the youth in Vizag, next week. This public meeting will be attended by around 50 thousand youth. This public meeting will probably be held on 27th March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu