»   » ఒక నిర్మాతను నిలబెట్టిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు...!?

ఒక నిర్మాతను నిలబెట్టిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ ఫైనాన్షియల్ నిర్మాత శింగనమల రమేష్ బాబు ఒకేసారి రెండు భారీ చిత్రాలు 'పులి", 'ఖలేజా" నిర్మించిన విషయం తెలిసిందే. 'పులి" ప్లాప్ టాక్ తెచ్చుకోగా", 'ఖలేజా" యావరేజ్ టాక్ తో రన్ అవుతోంది. తన సినిమా ద్వారా నిర్మాతకు నష్టం జనిందన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ 7కోట్లు తిరిగి నిర్మాతకు ఇచ్చేసినట్టు తెలిసింది. అలాగే మహేష్ కూడా తన రెమ్యునరేషన్ లో 2కోట్లు రిటర్న్ చేశారని సమాచారం.

ఏది ఏమైనా ఈ ఇద్దరు టాప్ హీరోలు తీసుకున్న నిర్ణయం నిర్మాతలకు తప్పకుండా కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఏది ఏమైనా ఒకే సినిమాని సంవత్సరాల తరబడి చెయ్యడం వల్ల కలిగే నష్టాలేమిటో ఈ ఇద్దరు హీరోలు బాగా గ్రహించి వుంటారు. నెక్స్ట్ వీరు చేయబోయే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చెయ్యాలని నిర్ణయించుకుంటారో దాన్ని బట్టే మిగతా నిర్మాతలు నష్టాల పాలు కాకుండా వుండగలుగుతారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu