For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  “కెమెరామెన్ గంగతో రాంబాబు”క్లైమాక్స్ నిజం కానుందా?

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హిట్ చిత్రం "కెమెరామెన్ గంగతో రాంబాబు". ఈ చిత్రం క్లైమాక్స్ గుర్తుండే ఓఉంటుంది. పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా యువకులను ఉద్దేశించి రమ్మని పిలుపు ఇవ్వగానే ఎక్కడెక్కడి వారు హైదరాబాద్ వస్తారు. అటువంటి సీనే త్వరలో నిజంగా జరిగే అవకాసముందని అంటున్నారు. మార్చి 14 న హైటెక్స్ కి రాష్ట్రం నలుమూలనుంచి పవన్ అభిమానులు వేలాదిగా చేరుకుంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ రోజు సాయింత్రం పవన్ రాజకీయాలపై తన ఎంట్రీ గురించి మాట్లాడతారు.

  ఇక 'రాజకీయం ఎలా ఉండాలి? పేదలకు ఏం చేయాలి? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎలా వ్యవహరించాలి?' అనే అంశాలపై తన ఆలోచనలకు అనుగుణంగా పవన్ పార్టీ రూపుదిద్దుకుంటోంది. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశంకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ పొలిటికల్ ఎంట్రీ, రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 'రాజకీయాలపై మార్చి రెండో వారంలో మాట్లాడతాను' అని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు... మరో వారంలో ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

  Pawan to repeat CMGR climax scene in Hitex?

  ఈనెల 12న లేదా 15న పవన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని తెలుస్తోంది. దీనికి జాతీయ మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. 45 నిమిషాల నుంచి గంటపాటు మాట్లాడేందుకు వీలుగా పవన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఒక హాలు బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజున హైదరాబాద్‌కు రావాల్సిందిగా పవన్ అభిమాన సంఘాల ప్రతినిధులకు సమాచారం వెళ్లింది.

  సన్నిహితులు, అభిమానులు పాల్గొనే ఈ సమావేశంలో... వేదికపై మాత్రం పవన్ ఒక్కరే ఉంటారని తెలుస్తోంది. వారందరి సమక్షంలోనే పవన్ తన రాజకీయ పార్టీపై ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండాలి? ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలి? పేదలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి?.... ఇలాంటి అనేక అంశాలపై తన లక్ష్యాలు, ఆకాంక్షలను పవన్ వివరిస్తారని తెలుస్తోంది.

  అలాగే... పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను ఇప్పటికే అక్షరబద్ధం చేసినట్లు సమాచారం. మీడియా సమావేశం అనంతరం ఆ పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఈసారికి మొత్తం అన్ని స్థానాల్లో కాకుండా... 9 లోక్‌సభ, 40 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే 'పవన్ పార్టీ' పోటీ చేస్తుందని తెలుస్తోంది.

  మొత్తానికి... ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పవన్ కల్యాణ్ మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు పార్టీ ఏర్పాటు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్టు సమాచారం. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ పార్టీ పెడుతున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది అచ్చంగా రాజకీయ పార్టీగా కాకుండా, 'రాజకీయ వేదిక'గా ఉంటుందని కూడా పేర్కొంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని, బహుశా... మల్కాజిగిరి లేదా కాకినాడ నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.

  English summary
  There is a scene in “Cameraman Ganga Tho Rambabu”, in which Pawan Kalyan speaks to the media asking all the youth to come out of their houses to change the society. Now, analysts are expecting the same scene to get repeated in Hitex on March 14th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X