twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాక్: పవన్ కళ్యాణ్...కాన్సిల్ చేసాడా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'గబ్బర్‌ సింగ్‌ 2'. ఈ చిత్రం ప్రారంభం ఆ మధ్యన జరిగింది. అయితే షూటింగ్ మాత్రం ఎంత కాలం ప్రారంభం కావటం లేదు. ఈ నేపద్యంలో... ఈ చిత్రం ఇక కాన్సిలే అనే వార్త అంతటా గుప్పుమంది. సినీ వర్గల్లో, వెబ్ మీడియాలో ఈ చిత్రం ఆగిపోయిందంటూ నిన్నటి నుంచి ప్రచారం జోరందుకుంది. తను అనుకున్నట్లు స్క్రిప్టు బాగా రాలేదని పవన్ ఈ చిత్రాన్ని పూర్తిగా ఆపేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తనకు నమ్మకమున్న రచయితలతో స్క్రిప్టు ప్రయత్నించిన పవన్...షేప్ కరెక్టుగా రావటం లేదని ఈ నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ఏ విధమైన ప్రకటనా లేదు. మరికొంతమంది ఈ వార్తను నమ్మలేము అంటున్నారు.

    పూర్తి స్ధాయి రాజకీయాల్లోకి వద్దామని నిర్ణయించుకున్న పవన్ ...తను చేసే కొద్ది చిత్రాలు పూర్తి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు. అది వేరే వారు అయితే గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ చిత్రం సీక్వెల్ ని ఎలాగైనా క్యాష్ చేసుకుందామని చూస్తారని, పవన్ మాత్రం అలాంటివాటికి దూరం కావటమే ఈ నిర్ణయానికి కారణం అని చెప్తున్నారు. మరి ఇదే నిజమైతే ఇన్నాళ్లూ ఈ చిత్రం కోసం ఆశగా ఎదురుచూసిన సంపత్ నందికి వేరే ప్రాజెక్టు అప్పచెప్తారా..లేదా అన్నది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న.

    Pawan's Gabbar Singh 2 is cancelled !?

    ప్రస్తుతం...

    వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది. కిషోర్‌ పార్థసాని (డాలి) దర్శకుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్‌బాబు, శరత్‌మరార్‌ నిర్మాతలు. హిందీలో విజయవంతమైన 'ఓమైగాడ్‌'కిది రీమేక్‌. సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ శివార్లలో జరుగుతోంది.

    ప్రత్యేకంగా రూపొందించిన గృహ సముదాయం సెట్‌లో వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రియ తదితర ముఖ్య పాత్రధారులపై టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ''తనకు జరిగిన నష్టానికి దేవుడి పైనే కేసు వేసిన ఓ వ్యక్తి కథ ఇది. అసలు ఆ వ్యక్తి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందనే నాటకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు చిత్రాన్ని ఆసక్తికరంగా మలుస్తున్నాడు'' అంటున్నారు దర్శకుడు. చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.

    English summary
    Pawan decided to do Gopala Gopala ahead of Gabbar Singh sequel and Sampath Nandi had to wait for some more time. Finally Pawan decided to call this project off as he is not hundred percent confident about the script.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X