ఛార్మి సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్?
చరిత చిత్ర పతాకంపై చార్మి ప్రధానపాత్రలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రూపొందిస్తున్న 'ప్రతిఘటన' చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వున్న పరిస్థితులను ఈ చిత్రంలో చూపిస్తున్నామని, ఇటీవల ఒరిస్సాలో జరిగిన ఓ మానభంగం కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, న్యాయంకోసం పోరాడే జర్నలిస్టుగా చార్మి ఈ చిత్రంలో నటిస్తోందని తెలిపారు.
వ్యవస్థకోసం నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందని ఆయన అన్నారు. న్యాయంకోసం పోరాడే పాత్రికేయురాలిగా తానీచిత్రంలో నటిస్తున్నానని, ఇలాంటి పాత్రలు చేయడం ఆనందాన్నిస్తాయని నటి చార్మి తెలిపారు. కార్యక్రమంలో రఘుబాబు, లక్ష్మీభూపాల్ చిత్ర విశేషాలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, కృష్ణ్భగవాన్, ఉత్తేజ్, అతుల్‌కులకర్ణి, ఆహుతి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.గోపాలకృష్ణ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: యశ్వంగ్‌నాగ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే: లక్ష్మీభూపాల్, దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ.


Click it and Unblock the Notifications












