»   » కొత్త ట్రెండ్ :సక్సెస్ కోసం... చిరు, చెర్రీ నీ ఫాలో అయిపోతున్న పవన్ కళ్యాణ్

కొత్త ట్రెండ్ :సక్సెస్ కోసం... చిరు, చెర్రీ నీ ఫాలో అయిపోతున్న పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ 'సరైనోడు', రామ్ చరణ్ 'ధృవ', చిరంజీవి 'ఖైదీ' సినిమాలు ఆడియో వేడుక నిర్వహించకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కొత్త ట్రెండ్ లోకి వెళ్లి ..ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన ఆ చిత్రాలన్నీ ఘన విజయం సొంతం చేసుకోవడంతో మెగా ఫ్యామిలీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెంటిమెంట్ గా మారిపోయింది. అందుకే ధరమ్ తేజ్ తన 'విన్నర్' చిత్రానికి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి విడుదలకు సిద్ధమయ్యారు. అందుకే పవన్ చిత్రానికి కూడా ఇలానే చేయాలనుకుంటున్నారని సమాచారం.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'కాటమరాయుడు' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ మార్చి నెలాఖరుకు విడుదలకు సిద్దమవుతోంది. అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఆడియో వేడుక నిర్వహించడంలేదని, ఒక్కో పాటను ఆన్ లైన్ లో విడుదల చేసి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారాని తెలుస్తోంది.


Pawan's Katamarayudu to follow Mega family trend?

అలాగే ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌ కేవలం 24 గంటల్లో 5 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. దీంతో చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా దాదాపు చిత్రీకరణ పూర్తయింది. మార్చి 10 నాటికి నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా సినిమా పూర్తవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Pawan Kalyan’s ongoing action entertainer, Katamarayudu, will be following pre release trend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu