»   » జగపతిబాబు సినిమా కథకి దగ్గరలో.. ‌: పవన్ ‘కాటమరాయుడు’ స్టోరీ లైన్ ఇదే

జగపతిబాబు సినిమా కథకి దగ్గరలో.. ‌: పవన్ ‘కాటమరాయుడు’ స్టోరీ లైన్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. కిశోర్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ బయిటకు వచ్చింది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆ కథ....తమ్ముళ్ల బాగోగుల్ని కాంక్షిస్తూ ఓ అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు? తను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు? అనే యాంగిల్ లో సాగుతుంది. పవన్ ఇందులో మిడిలేజ్డ్ ఫ్యాక్షనిస్టు పాత్ర పోషిస్తున్నాడట. అతడికి నలుగురు అన్నదమ్ములుంటారి. వాళ్లు కమల్ కామరాజు.. విజయ్ దేవరకొండ, శివబాలాజీ,అజయ్. 'కీచక' ఫేమ్ యామిని భాస్కర్.. మరో కొత్తమ్మాయి మానస హిమవర్ష.. హీరో తమ్ముళ్లను ప్రేమించే అమ్మాయిలుగా కనిపించబోతున్నారు.

ఈ సినిమా జగపతిబాబు హీరోగా వచ్చి హిట్టైన 'పెద్దరికం' ఛాయలతో ఉంటుంది. ఈ సినిమాలో హీరోకు ఆడవాళ్లంటే పడదు. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఐతే అతడి నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడతారు. అది అన్నయ్య అంగీకరించడని భావించి.. అతడినే ఓ అమ్మాయి ప్రేమలోకి దించుతారు. ఇలా సాగుతుంది 'కాటమరాయుడు' కథ. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌పై ఈ చిత్ర కథ సాగుతుందట. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Pawan's Katamarayudu - Story line

వీరమ్ మూవీని కొన్ని ఛేంజెస్ తో తెలుగులో తీయబోతున్నారు. అజిత్ యాక్ట్ చేసిన వీరమ్ పూర్తిగా తమిళ వాతావరణానికి తగ్గట్టు తీశారు. పూర్తిగా ఆ వాతావరణం కనబడితే అంతగా బాగుండదని, పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని, మన సంప్రదాయానికి తగ్గట్టు మార్పులు చేస్తున్నారని అంటున్నారు. మార్పులు చేసేటప్పుడు పవన్ ఫ్యాన్స్ ను కూడా దృష్టిలో ఉంచుకుంటారట.

పవన్ సినిమా కథను మారుస్తున్నప్పటికీ తమిళంలోని అసలు కథ దెబ్బతినకుండా ఈ మార్పులు చేస్తున్నారట. అజిత్ చేసిన తమిళ మూవీ వీరమ్ యాక్షన్ లవ్ స్టోరీ. 'వీరమ్‌'లో అజిత్ చేసిన పాత్రను పవన్ కల్యాణ్‌ చేస్తున్నాడు

ఇక ఇప్పటికే విడుదల చేసిన పవన్‌ పోస్టర్లు ఇప్పటికే సందడి చేస్తున్నాయి. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.


సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన ఈ పోస్టర్‌లో కోడిపుంజు పట్టుకుని, పంచెకట్టుతో దర్శనమిచ్చారు పవన్‌. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

నిర్మాత మాట్లాడుతూ ''సామాజిక మాధ్యమాల్లో వినూత్న రీతిలో చేసిన 'కాటమరాయుడు' ప్రచారం అభిమానుల్లో హుషారు పుట్టించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాం. ఈ నెల 16 నుంచి ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తవుతుంది. మా సినిమా తొలి టీజర్‌ని ఈ నెల 26న విడుదల చేస్తున్నాం. . మార్చి 29న 'ఉగాది'కి విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Pawan ’s most anticipated film Katamarayudu will be hitting the screens in March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu