For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా పవన్‌తోనా...

  By Srikanya
  |

  హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా తియ్యచ్చా... అంటే తీసి చూపిస్తానంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో 'కోబలి' అనే చితం రూపొందనుంది. రాయలసీమ ప్రాంతంలో జంతువులను దేవుడికి బలి ఇవ్వడాన్ని 'కోబలి'అనే పేరుతో వ్యవహరిస్తారని, ఈ చిత్రానికి కమర్షియల్ అంశాల గొడవ లేకుండా కథను తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలియజేశారు. అయితే అసలు పవన్ కళ్యాణే కమర్షియల్ ఎలిమెంట్ కదా...ఆయన చేయటంతోటే కమర్షియల్ అప్పీల్ వస్తుంది కదా అంటున్నారు.

  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవల బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేది' చిత్రం మరో చిత్రంలో పవన్, త్రివిక్రమ్ కలిసి పనిచేయడానికి దారి సిద్ధమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో 'కోబలి' అనే చితం రూపొందనుంది. ఈ విషయాన్ని దర్శకుడే స్వయంగా ప్రకటించడం విశేషం. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళే ఈ చిత్రం పూర్తి క్లాసికల్ మూవీలా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంతో అవార్డులను ఆశిస్తున్నారా అని అడిగితే అవార్డుల కోసం ఈ చిత్రాన్ని నిర్మించడంలేదని ఆయన స్పష్టం చేశారు. 'అత్తారింటికి దారేది' చిత్రంతో ఈ కాంబినేషన్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. మళ్లీ సరికొత్త చిత్రంతో వారు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

  పవన్ కళ్యాణ్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రై.లి'పై ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. 'కో..బలి'(నరుకు..బలి) అనే టైటిల్ జనవరి నెలలో ఏఫీ ఫిల్మ్ ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ హౌజ్ పేరిట రిజిస్టర్ అయింది. త్రివిక్రమ్ మాట్లాడుతూ.... 'కోబలి' కథ ఇంకా ప్రిలిమినరీ స్టేజస్‌లోనే ఉంది. శాతవాహనుల తర్వాత కాలం నాటి లాంగ్వేజ్‌ను, కప్పట్రాల ఆ ప్రాంతాల్లో వాడిన అచ్చమైన తెలుగును వాడుతున్నాం. ఇప్పటికీ ఆ ఏరియాలో అందమైన తెలుగు వినిపిస్తుంది. మెహబూబ్‌నగర్‌లోని పలు గ్రామాల్లో కూడా తెలుగు భాష సౌందర్యం వినిపిస్తూనే ఉంటుంది. లాంగ్వేజ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. కోబలి స్క్రిప్ట్‌కే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేం అన్నారు.


  'కోబలి' గురించి.... త్రివిక్రమ్ మాట్లాడుతూ.... పవన్‌తో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నాను. అవును.. అదే 'కోబలి'. రాయలసీమ ప్రాంతంలో ఈ పదం వినిపిస్తుంటుంది. అంటే అమ్మవారికి బలివ్వడం అన్నమాట. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచెం కష్టంతో కూడిన కథ. ఆ సాహసమేదో మేమిద్దరమే చేయాలనుకొన్నాం. 'కోబలి' సమాంతర చిత్రం అనుకోలేం. అలా అనలేం. అవార్డు సినిమా, సమాంతర సినిమా అంటూ విడగొట్టి చూడడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అంతే.వీలైనంత తొందర్లోనే ఈ సినిమాను మొదలుపెడతాం. 'గబ్బర్‌ సింగ్‌ 2'కి సంభాషణలు రాయటం లేదు. తరవాతి సినిమా ఇంకా ఏమీ అనుకోలేదండీ. తొందర్లోనే ఆ విషయాలు చెబుతాను అన్నారు.

  English summary
  Trivikram had to say “Kobali is a tough subject to handle. We are doing some research about it. Pawan and I will produce this film and we want to start this as soon as we can”, he said. Trivikram also revealed that he is not involved with ‘Gabbar Singh 2′. But the star director and Pawan Kalyan are doing some pre-production work for ‘Kobali’, which is expected to be a Rayalaseema based story.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more