For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇగో క్లాష్...విభేధాలు :అందుకే 'సర్దార్‌' షూటింగ్ ఆగింది

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ లో ఇగో క్లాషెష్ చోటు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ చిత్రానికి సనిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న జయనేని విన్సెంట్ తో దర్శకుడు బాబికి కొన్ని ఇగో క్లాషెష్, క్రియేటివ్ డిస్ట్రిబెన్సెలు చోటు చేసుకున్నాయని, దాంతో జయన్ విన్సెంట్ బయిటకు వచ్చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

  అయితే ఈ విషయమై పవన్ మధ్యలో వేలు పెట్టలేదని, బాబి తనకు నచ్చిన కెమెరామెన్ ఆర్దర్ ఎ విల్స్ ని తీసుకువచ్చి మిగతా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారని తెలుస్తోంది. అందుకే షూటింగ్ డిలే అవుతూ వస్తోందని అంటున్నారు.

  ఇంతకు ముందు ఇదే సినిమా నిమిత్తం దర్శకుడు సంపత్ నందిని మొదట అనుకుని ..క్లాషెష్ వచ్చి బాబిని సీన్ లోకి తెచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ని తీసుకువచ్చి ఆ తర్వాత ఆమెతో విభేదాలు వచ్చి కాజల్ అగర్వాల్ తో షూట్ చేస్తున్నారు.

  Pawan's Sardaar Gabbar Singh: Ego Clashes

  షూటింగ్ లొకేషన్ ...నానక్ రామ గూడలో అని సమాచారం. అక్కడ గణేష్ మాస్టర్ సూపర్ విజన్ లో ఇంట్రో సాంగ్ తీయనున్నారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫి లో ఇంతకు ముందు గోపాల గోపాల చిత్రంలో భజే భజే పాట చేసారు. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నారు. ఇక ఈ పాట తర్వాత నానక్ రామ్ గూడలోనే నాలుగు రోజులు పాటు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్ లో కాజల్ కూడా పాల్గొననుంది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  చిత్రం విశేషాలకు వెళ్తే...

  పవన్‌ కల్యాణ్‌ ఖాకీ కడితే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో 'గబ్బర్‌ సింగ్‌'లో చూశాం. 'నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది' అంటూ డైలాగులనే బులెట్లులా పేల్చారు అందులో. ఇప్పుడు మళ్లీ పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ అవతారం ఎత్తాడు. మరోసారి లాఠీ పట్టి హంగామా చేయబోతున్నాడు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాబీ దర్శకుడు. మొన్నటివరకూ ఈ ప్రాజెక్టు 'గబ్బర్‌సింగ్‌ 2' పేరు మీదే చలామణీ అయ్యింది. ఈ చిత్రానికి ఇప్పుడు సరికొత్త పేరు 'సర్దార్‌' పెట్టి ఫస్ట్ లుక్ వదిలారు.

  నిర్మాత మాట్లాడుతూ ''ఈ సినిమా 'గబ్బర్‌సింగ్‌'కు సీక్వెలో ప్రీక్వెలో కాదు. ఇదో కొత్త కథ. పవన్‌ చిత్ర కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమాలోని భావోద్వేగాన్ని ప్రతిఫలించేలా ఫస్ట్ లుక్ ను రూపొందించాం. దేవిశ్రీప్రసాద్‌ అందించిన బాణీలు ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు.

  Pawan's Sardaar Gabbar Singh: Ego Clashes

  'గబ్బర్‌ సింగ్‌ 2' విషయంలో అన్ని జాగ్రత్తలూ పవన్ తీసుకుంటున్నారు. ఆయన తన 'గబ్బర్‌ సింగ్‌ 2' కోసం ఓ నూతన నటుడ్ని ప్రతినాయకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేయబోతున్నారు. అతనే.. శరత్‌ కేల్కర్‌. ఈ మరాఠీ నటుడు 'గబ్బర్‌సింగ్‌ 2'తో ప్రతినాయకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు.

  ప్రతినాయకుడి పాత్రకు ఎంతోమందిని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేసి.. చివరికి పవన్‌ కేల్కర్‌ని ఎంచుకొన్నారట. ఇటీవల ఇతనిపై కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. కేల్కర్‌ నటన పట్ల పవన్‌ చాలా సంతృప్తితో ఉన్నారని తెలిసింది. కేల్కర్‌కి తెలుగురాదు. అయినా సరే... తెలుగు నేర్చుకొని, తన డైలాగులను తనేపలికాడట.

  కేల్కర్‌ గొంతులో గాంభీర్యం, వృత్తిపై అతనికున్న శ్రద్ధ పవన్‌కి బాగా నచ్చాయని చిత్రబృందం చెబుతోంది. ఇటీవల హైదరాబాద్ లో రెండో షెడ్యూలు నైట్ షూటింగ్ లతో మొదలైంది. బాబి దర్శకతం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాత.

  నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, పోరాటాలు: రామ్‌ లక్ష్మణ్‌, కెమెరా: జయనన్‌ విన్సెంట్‌.

  English summary
  Now, after finishing couple of schedules, cinematographer of the Sardaar Gabbar Singh film, Jayanan Vincent walked out of the film due to ego clashes or creative disturbances as they would like to say it.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X