»   »  ఎక్సక్లూజివ్ : పవన్ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కథ, మెయిన్ ట్విస్ ఇదే

ఎక్సక్లూజివ్ : పవన్ ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కథ, మెయిన్ ట్విస్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ హీరో గా నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' రేపే (ఏప్రియల్ 8)న రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ఎలా ఉండబోతోంది. కథ ఏమిటీ అనే చర్చలు అంతటా నడుస్తున్నాయి.ఈ సందర్బంగా ఎక్సక్లూజివ్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న ఓ కథని మీకు అందిస్తున్నాం.

ఇదే సర్దార్ గబ్బర్ సింగ్ కథ ..అని చెప్పటం లేదు. ఇది కేవలం కొందరు కల్పించిన ఊహే కావచ్చు. మీరు కూడా ట్రైలర్ చూసి కథ ఇలా ఉంటుంది అనుకుని ఉంటారు కదా...అలాంటిదే ఇది కూడా అనుకోండి...రిలీజ్ అయ్యాక...ఇదే కధా అవునా కాదా చూడండి...సరదాగా ఉంటుంది.


బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. కాజల్‌ తొలిసారి ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ సరసన నటించారు. ఈ చిత్రం పవన్ సూపర్ హిట్ గబ్బర్ సింగ్ చిత్రానికి ఫ్రాంచైజీ చిత్రం.


అలాగే సర్దార్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసేందుకు సిద్ధమైన పవర్ స్టార్ సినిమాను సాధ్యమైనంత గ్రాండ్ గా ఓ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఇన్నాళ్లూ తెలుగు సినిమా రిలీజ్ కు నోచుకోలేని మెక్సికో లాంటి దేశాల్లో కూడా పవన్ తన తాజా చిత్రం రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.


ఓవర్సీస్ లో ఇప్పటివరకు బాహుబలి రికార్డ్స్ మాత్రమే మొదటి స్థానంలో ఉన్నాయి ఇప్పుడు సర్దార్ ను ఏకంగా 50 దేశాల్లో రిలీజ్ చేసి ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు పవన్.


స్లైడ్ షోలో కథను చదవండి.


ప్రారంభమే

ప్రారంభమే


సినిమా ప్రారంభం ...రతన్ పూర్ విలేజ్ ని డిస్క్రైబ్ చేస్తూ మొదలవుతుంది. పోలీసు స్టేషన్, రైల్వే ట్రాక్, ఓవర్ హెడ్ ట్యాంక్, మార్కెట్‌తోపాటు గోవింద్‌రామ్ హోయిర్ సెలూన్, దాబా, కిరాణా దుకాణం, స్క్రాప్ దుకాణం, పోస్ట్ ఆఫీస్, లైబ్రరీ, కొన్ని నివాసాల సముదాయం అసలు అక్కడికి వెళ్తే మనం ఓ ఊరికి వచ్చామా అన్నంత నేచురల్ గా ఆ సెట్టింగ్ రూపొందించారు..భైవర్ సింగ్

భైవర్ సింగ్


అలాగే ఊరుని ఏలుతున్న దుర్మార్గుడైన భూస్వామి భైరవ్ సింగ్ (శరద్ కేల్కర్). అతను ఆ గ్రామంలోని ఇళ్లను కొందరు గూండాలతో పొలిటికల్ పవర్ ని ఉపయోగిస్తూ నాశనం చేయించే పనిలో ఉంటాడు.విలన్ లక్ష్యం

విలన్ లక్ష్యం


రతన్ పూర్ లో క్రింద మైన్స్ ఉంటాయి. వాటి కోసం అక్కడ జనాలను నానా రకాల హింసలు పెడుతూంటాడుముఖేష్ రుషి

ముఖేష్ రుషి


అక్కడ రతన్ పూర్ రాజు ముఖేష్ రుషి. శరద్ కేల్కర్ కు ఎదురుచెప్పలేని నిస్సహాయ స్దితిలో ఉంటాడు.


రిక్వెస్ట్ పై

రిక్వెస్ట్ పై


రతన్ పూర్ రాజు ముఖేష్ రుషి రిక్వెస్ట్ పై... పోలీస్ డిపార్టమెంట్ లోని హైయ్యర్ అఫీషియల్స్..సర్దార్ గబ్బర్ సింగ్ ని అక్కడకి ట్రాన్సఫర్ చేస్తారు.


ప్రమోషన్

ప్రమోషన్


సర్దార్ గబ్బర్ సింగ్ కు సిఐ గా ప్రమోషన్ ఇచ్చి రతన్ పూర్ కు ట్రాన్సఫర్ చేస్తారు.వారసురాలు అని తెలియక

వారసురాలు అని తెలియక


పవన్ కళ్యాణ్ ..కాజల్ ఆ రతన్ పూర్ సంస్దానానికి ఏకైక వారసురాలు అని తెలియక ఆమెతో ప్రేమలో పడతాడు.సామాన్య పోలీస్ గా

సామాన్య పోలీస్ గా


ఫస్ట్ హాఫ్ మొత్తం అక్కడక్కడా తిక్క చూపిస్తూ..సామాన్య పోలీస్ గా కామెడీ చేస్తూ గడుపుతాడు సర్దార్.ఫస్టాఫ్ ఎండ్ లోనే

ఫస్టాఫ్ ఎండ్ లోనే


దాదాపు ఇంటర్వెల్ దగ్గరలో ఆమె రతన్ పూర్ యువరాణి అని పవన్ కు రివీల్ అవుతుంది.ఇంటర్వెల్ బ్యాంగ్

ఇంటర్వెల్ బ్యాంగ్


ఫస్టాఫ్ ఎండింగ్ లో విలన్ శరద్ కేల్కర్ కు, పవన్ కు మధ్య ఛాలెండ్ వస్తుంది.72 గంటల్లో

72 గంటల్లో


పవన్ ని 72 గంటల్లో ఉద్యోగంలోంచి తీయించేస్తానని శరద్ కేల్కర్ ఛాలెంజ్ చేస్తాడు.పలుకుబడితో

పలుకుబడితో


తన రాజకీయ పలుకుబడితో పవన్ కళ్యాణ్ జాబ్ తీయించేస్తాడు విలన్.తణికెళ్ల భరణి

తణికెళ్ల భరణి


జాబ్ పోయాక...పవన్ ..తణికెళ్ల భరిణిని కలుస్తాడు. భరిణి... పవన్ కు పై అధికారి. విలన్ తో చేతులు కలిపి ఉంటాడు.భరిణిని ఏమార్చి

భరిణిని ఏమార్చి


తణికెళ్ల భరణిని పట్టుకుని ఏమార్చి, తను మారానని విలన్ శరద్ కేల్కర్ ఇల్లీగల్ ఏక్టవిటీస్ కు సపోర్ట్ చేస్తానని, తన జాబ్ తనకు ఇప్పిస్తే చాలని అంటాడు.సపోర్ట్ చేస్తూనే ...

సపోర్ట్ చేస్తూనే ...


పవన్ ..విలన్ కు సపోర్ట్ చేస్తూనే అతని ప్రక్కన ఉంటూనే అతని సామ్రాజ్యాన్ని సైలెంట్ గా కూల్చేస్తాడు.ఫైనల్ గా

ఫైనల్ గా


చివరకు సర్దార్ ...శరద్ కేల్కర్ పీడను రతన్ పూర్ వాసులుకు తప్పించి, వారు ఆనందంగా హ్యాపీగా జీవించేటట్లు చేస్తాడు.అంతేనా

అంతేనా


ఎప్పటిలాగే తను ప్రేమించిన రతన్ పూర్ యువరాణిని పెళ్లి చేసుకుంటాడు.కాజల్ క్యారక్టర్

కాజల్ క్యారక్టర్


ఈ సినిమాలో కాజల్ క్యారక్టర్ ఏమిటీ అంటే ఆమె పేరుకు యువరాణినే కానీ ఆస్తులు ఏమీ మిగిలి ఉండవు. అయితే తమ రాజ్యానికి సంభందించిన ట్రస్ట్ లు నడపటానికి డబ్బు అవసరమైతే తమ సంస్దానంలోని విలువైన వస్తువులు అమ్ముతూంటుంది.బ్రహ్మానందం

బ్రహ్మానందం


కామెడీ కింగ్ బ్రహ్మానందం ... కాజల్ కు మామయ్య గా కనిపిస్తాడు. తుపాకులు అమ్ముతూంటాడు.రావు రమేష్

రావు రమేష్


రావు రమేష్ కు కాజల్ కు సపోర్ట్ గా ఉంటూ.. రాజ్యంలోని వస్తువులను అమ్మటానికి ఆమెకు సహాయపడుతూంటాడు. తమ ట్రస్ట్ ద్వారా విలేజ్ లోని వారి సాయానికి ఆ డబ్బు వాడుతూంటారు.English summary
Pawan Kalyan much awaited film ‘Sardaar Gabbar Singh’ is getting ready to hit the big screens on April, 8th . Here is the leaked story line of Sardaar.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu