»   » జూ ఎన్టీఆర్ ‘శక్తి’కి పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ ఫీవర్...!

జూ ఎన్టీఆర్ ‘శక్తి’కి పవన్ కళ్యాణ్ ‘తీన్ మార్’ ఫీవర్...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిన్నమొన్నటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాకి 'లవ్లీ", 'ఖుషీగా" టైటిల్స్ తో మీడియాలో హడావిడి జరిగింది. తాజాగా 'తీన్ మార్"(సెలబ్రేషన్ ఆఫ్ లవ్" టైటిల్ ని ఎనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి, ఫ్యాన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రెస్పాన్స్ చూసి 'శక్త" టీమ్ కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. ఈనెలలోనే హడావిడిగా 'శక్తి" పబ్లిసిటీ స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఈవేళ టాలీవుడ్ లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రంగా యన్టీఆర్ నటిస్తున్న 'శక్తి' చిత్రాన్ని చెప్పుకోవాలి.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు సినిమా చరిత్రలోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంచితే, ఈ సినిమా కీలక సన్నివేశాలకు సంబంధించిన ఫైట్స్ ను స్టన్ శివ నేతృత్వంలో గత కొన్ని రోజులుగా హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. యన్టీఆర్ తో బాటు పలువురు ఫైటర్స్ ఈ షూటింగులో పాల్గొంటున్నారు. కాగా, దీనికి సంబంధించిన ఓ పాటను ఫిబ్రవరి 14 నుంచి షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తీన్ మార్, శక్తి, ఈ రెండు సినిమాలూ సమ్మర్ కే వచ్చే అవకాశఆలు వుండడంతో ఒకర్ని మించి ఒకరు పబ్లిసిటీ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే అదుర్స్, బృందావనం సాధించిన విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో వున్న జూ ఎన్టీఆర్ 2011లో మరో హిట్ కొట్టాలని వస్తుండగా, ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన 'కొమరం పులి" ప్లాప్ కావడంతో నెక్స్ ట్ ఫిల్మిం ఎలాగైనా రికార్డ్ క్రియేట్ చేసేది అవ్వాలనే కసితో 'తీన్ మార్"తో వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2010లో సూపర్ హిట్ల రుచి చూసిన జూ ఎన్టీఆర్ 'శక్తి" తో మరోసారి తన శక్తి చూపిస్తాడా?నిరుత్సాహంగా వున్న పవర్ స్టార్ అభిమానుల్ని 'తీన్ మార్ "ఆడిస్తాడా? ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu