»   »  అదిరిపోతుందంతే : పవన్,పి.సి శ్రీరామ్ కాంబినేషన్

అదిరిపోతుందంతే : పవన్,పి.సి శ్రీరామ్ కాంబినేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ హిట్ 'ఓ మై గాడ్' సినిమాకి రీమేక్ ఓ చిత్రాన్ని పవన్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హైలెట్ గా ఉండే అంశం ఒకటి వచ్చి చేరింది. అది మరేదో కాదు...ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీరామ్ ని ఈ సినిమాకి తీసుకున్నారు. గతంలో పవన్ 'ఖుషి' చిత్రానికి పి.సి.శ్రీరామ్ పనిచేసిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత పవన్,పి.సి శ్రీరామ్ కాంబినేషన్ అనేసరికి అభిమానులలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక పి.సి శ్రీరామ్ ఈ మధ్య కాలంతో తెలుగులో చేసిన చిత్రం నితిన్ ఇష్క్ చిత్రం.

వెంకటేష్‌తో కలిసి 'ఓ మై గాడ్‌' రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ చిత్రానికి 'దేవ దేవమ్‌ భజే...' అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. దేవుడి చుట్టూ సాగే కథ కావడంతో ఆ పేరైతేనే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. పవన్‌ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలోనూ దేవ దేవమ్‌ భజే... అంటూ ఓ పాట సాగుతుంది. అయితే ఈ టైటిల్‌ గురించి చిత్రబృందం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సివుంది.

PC. Sriram for Pawan's OMG remake

అలాగే బాలీవుడ్ చిత్రాన్ని చాలా మార్చి తెలుగు నేటివిటికి తగినట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఒరిజనల్ లో ఉన్న పరేష్ రావెల్ పాత్ర కు ఇద్దరు పిల్లలు ఉంటే..ఇక్కడ వెంకటేష్ కి ఇద్దరు చెల్లెళ్లు ఉండేలా మార్చారని తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ గెటప్ సైతం పూర్తి మార్పుతో ఉంటుందని,దానిపై కసరత్తు జరిగిందని చెప్తున్నారు. మొదట వెంకటేష్ తో షూటింగ్ మొదలు పెట్టి తర్వాత పవన్ తో ఫినిష్ చేస్తారు. ఈ మేరకు ప్రత్యేకమైన వీధి సెట్ ని వేసారు.

పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ కలిసి నటిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అది ఇప్పటికి కుదిరింది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఇందులో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ చేసిన శ్రీ కృష్ణుని పాత్రలో పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ చేసిన ఓ సాధారణ వ్యాపారి పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. డాలీ ఈ చిత్రం డైరక్ట్ చేస్తారు.


కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

English summary
Reportedly,Pawan Kalyan-Venkatesh starrer 'Oh My God' remake has roped ace cinematographer PC Sriram for the movie. Both Pawan and PC worked earlier for blockbuster 'Kushi'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu