twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బెజవాడ' విడుదలపై పోలీసు ఏర్పాట్లు

    By Srikanya
    |

    నాగచైతన్య తాజా చిత్రం బెజవాడ రిలీజ్ అవుతోందంటే బెజవాడలో భయం మొదలైంది. మళ్ళీ ఏ గొడవలు మొదలవుతాయో, కులాల మధ్య కొట్లాటలు ప్రారంభమవుతాయో అని అంతా భయపడుతున్నారు. మరో ప్రక్క పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలని పైనుంచి ఆర్డర్స్ ఉండటంతో బెజవాడ విడుదలైన మూడు రోజుల వరకూ చాలా జాగ్రత్తగా అన్ని చోట్లా కన్నేసి ఉంచుతున్నారు. అల్లరి మూకలు చెలరేగి పోకుండా ఉండేందుకు వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు అప్రకటిత 144 సెక్షన్ నడిచే అవకాశముందని తెలుస్తోంది. ధియోటర్స్ వద్ద కూడా పెద్ద హంగామా జరపకూడదని ధియోటర్స్ ఓనర్స్ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వంగవీటి రంగా వర్గీయులు ఈ చిత్రంలో తమ కాపు కులాన్ని తక్కువ చేసి చూపెట్టినా,రంగాని సరిగ్గా చూపకపోయినా ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరో వర్గం అయితే ఆ చిత్రంలో తమ వారిని బాగా చూపెట్టారని బ్యానర్స్ కట్టి మరీ సంతోషం వెల్లబుచ్చుతోంది. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని అంతా భయం భయం గా చూస్తున్నారు.

    ఇక ఈ చిత్రంలో నాగచైతన్య, అమలాపాల్, ప్రభు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అజయ్, అంజనా సుఖాని, శుభలేఖ సుధాకర్, అభిమన్యు సింగ్, ముకుల్‌దేవ్, సత్యప్రకాష్, అశోక్‌కుమార్, శ్రావణ్, లక్ష్మీ, రాహుల్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.కె.భూపతి, ఎడిషనల్ ఫోటోగ్రఫీ: హర్ష్, రవి, సఫన్, సంగీతం: అమర్ మొహెలె, ప్రదీప్ కోనేరు, ప్రేమ, ధరమ్ సందీప్, విక్రమ్, బప్పి టూటెల్, పాటలు: రెహమాన్, సిరాశ్రీ, కలువసాయి, కూర్పు: గౌతంరాజు, ఫైట్స్: ఇజాజ్-జావేద్, కళ: కృష్ణమాయ, నృత్యాలు: ప్రేమ్‌రక్షిత్, శోభ, ప్రొడక్షన్ డిజైనర్: కిషోర్, నిర్మాతలు: రామ్‌గోపాల్‌వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వివేక్‌కృష్ణ

    English summary
    The city of Vijayawada is preparing itself for ‘Bejawada’ film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X