»   » ట్రైలర్ చూసి తెగ నచ్చేసి, డైరక్టర్ ని పిలిపించుకున్న మహేష్

ట్రైలర్ చూసి తెగ నచ్చేసి, డైరక్టర్ ని పిలిపించుకున్న మహేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : విజయ్ హీరోగా రెడీ అయ్యి త్వరలో విడుదల కానున్న చిత్రం 'పోలీసోడు'. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ. ఈ చిత్రం ట్రైలర్ చూసిన మహేష్ బాబు థ్రిల్ అయ్యిపోయాడని సమాచారం. వెంటనే ఆ దర్శకుడుకు ఫోన్ చేసి బెస్ట్ విషెష్ చెప్పటం, ఏదన్నా కథ ఉంటే కలసి చేద్దామని మహేష్ ప్రపోజల్ పెట్టడం జరిగిందని సమాచారం. దాంతో వెంటనే అట్లీ ఇక్కడ వాలిపోయి..గత కొద్ది రోజులుగా మహేష్ తో సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

Also See: విజయ్ 'పోలీసోడు'ట్రైలర్ (వీడియో)

అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని, ప్రస్తుతం డిస్కషన్స్ స్టేజీలోనే ఈ ప్రాజెక్టు ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ధేరి చిత్రం రిలీజ్ తర్వాత మహేష్ ఈ చిత్రం విషయమై ఓ క్లారిటీకు వచ్చే అవకాసం ఉంది. తమిళంలోనూ మహేష్ తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. అందులో బాగంగానే మురుగదాస్ తో ఓ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. అట్లీ తో కూడా అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే త్వరలో ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

Polisodu director to work with Mahesh?

తెలుగులో నేరుగా సినిమా చేయడంపై అట్లీ స్పందిస్తూ ''రాజా రాణి తర్వాతే తెలుగులో ఎన్న ఆఫర్లు వచ్చాయి. అయితే తమిళంలో ఓ పెద్ద హిట్ కొట్టాకే ఇక్కడ చేయాలనుకున్నా. ఇప్పుడు 'పోలీసోడు' విడుదలకు రెడీ అయింది. తర్వాత తెలుగులో ఓ భారీ సినిమా చేసే ఉద్దేశ్యం ఉంది'' అని చెప్పుకొచ్చారు.

మరో ప్రక్క 'తుపాకి' సినిమా ద్వారా టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్. తమిళనాడులో రజనీకాంత్ తరువాత అంతమంది అభిమానులున్న విజయ్, ఈసారి ఎలాగైనా తెలుగు మార్కెట్ దక్కించుకోవాలనే సన్నాహాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన 'తేరీ' సినిమా ట్రైలర్ ఇప్పటికే తమిళంలో మంచి రెస్పాన్స్ పొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'పోలీసోడు' గా విడుదల చేయనున్నారు.

Polisodu director to work with Mahesh?

ఏప్రిల్ 14న భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇటీవల విన్నర్ అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వినిపించింది. గతంలో రాజారాణి అనే ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించిన అట్లీ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు.

English summary
Mahesh babu may soon work with the director of ‘Polisodu’, Atlee, for his next project. The director is in sittings with Mahesh Babu and he is keen on making a straight Telugu film with the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu