»   »  నష్టపరిహారం కడదామనే ఫిక్స్ అయ్యిందేమో

నష్టపరిహారం కడదామనే ఫిక్స్ అయ్యిందేమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: పాతిక లక్షలు రూపాయలు ఫైన్, కోర్టు కేసు, సంవత్సరాల తరబడి డబ్బాల్లో సినిమా మగ్గటం వంటివి ఏ నిర్మాతకైనా ఇబ్బందికరమైన అంశమే. అయితే పూజాగాంధీ అలాంటివి పట్టించుకునేటట్లు కనపటం లేదు. వీరప్పన్ మీద చిత్రం తీసినందుకు గతంలో ఆయన భార్య ముత్తు లక్ష్మి కేసు వేసి నష్టపరిహారంగా పాతిక లక్షలు పొంది సెటిల్ చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే రూటులో మరో సినిమా ప్రయాణం పెట్టుకోవటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే ముత్తు లక్ష్మి అనుమతితోనే ఈ బయోపిక్ చేస్తోందని... కాబట్టి ఈ సమస్య రాకపోవచ్చు అంటున్నారు.

ముత్తులక్ష్మి పేరు గుర్తుందా? దాదాపు రెండు దశాబ్దాల పాటు కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేసిన అడవి దొంగ వీరప్పన్‌ భార్య పేరు ముత్తులక్ష్మి. ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో ముత్తులక్ష్మి పాత్రను ప్రముఖ కన్నడ నటి పూజాగాంధీ పోషించనుంది. అంతేకాదు ఈ సినిమాకు ఆమె నిర్మాతల్లో ఒకరు. త్వరలోనే ఇతర వివరాలు వెల్లడికానున్నాయి. ఈ చిత్రం ద్వారా జగ్గి అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

Pooja Gandhi play Muthulakshmi Veerappan

గతంలో... గంధపు చెక్కల స్మగ్లర్‌, అడవి దొంగ వీరప్పన్‌ జీవిత విశేషాల ఆధారంగా తీసిన 'వనయుద్ధం' చిత్రం విడుదలకు అడ్డంకులు తొలగిపోయే క్రమంలో కొన్ని నాటకీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు నుంచి నిర్మాతలకు అనుమతి వచ్చిన తర్వాతే విడుదల చేసారు. ఈ చిత్రం విడుదల తర్వాత తమ కుటుంబం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వీరప్పన్‌ భార్య వి.ముత్తులక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో అక్షయ క్రియేషన్స్‌ నిర్మాతలు రూ.25 లక్షలను పరిహారంగా ఆమెకు అందజేసేందుకు ముందుకొచ్చారు.

ఈ చిత్రం విడుదలపై గం ధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ చెన్నై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కోర్టు వనయుద్ధం చిత్రంపై తాత్కాలిక స్టేను విధించింది. ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ చిత్ర దర్శక నిర్మాత హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇందులో ఆయన తరపు న్యాయవాది ఎ.నటరాజన్ హాజరై వీరప్పన్ గురించి ప్రచారమైన వార్తలను ఇతివృత్తంగా తీసుకుని 'వీరప్పన్‌' ( కన్నడ వనయుద్ధం) చిత్రాన్ని తెరకెక్కించామని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి ఇటువంటి సమస్యే ఎదురయ్యే అవకాసం ఉందంటున్నారు.

English summary
Muthulakshmi Veerappan was at a press conference in Bangalore to announce the film, during which she said that marrying Veerappan was a big mistake and that she lived all of three years with him. She also claimed that much of what was depicted in Attahasa was not true. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu