»   » పూజా హెగ్డేకు ‘ఎన్టీఆర్’ కష్టాలు.. అందుకే మొదలు పెట్టిందట!

పూజా హెగ్డేకు ‘ఎన్టీఆర్’ కష్టాలు.. అందుకే మొదలు పెట్టిందట!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pooja Hegde Starts To Improve Her Dancing Skills

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనలోనే కాదు.. డ్యాన్సుల్లో కూడా ఇరగదీస్తాడని కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింహాద్రి, యమదొంగ తదితర చిత్రాలు ఆయన సత్తా ఏంటో నిరూపించాయి. తారక్ పక్కన డ్యాన్సు చేయాంటే హీరోయిన్లకు గుండె దడే. ఎందుకంటే ఆయన స్పీడ్ అలా ఉంటుంది. తాజాగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే‌కు అలాంటి కష్టాలే ఎదురుకానున్నాయి.

కెరీర్‌పై దృష్టిపెట్టిన పూజా హెగ్డే

కెరీర్‌పై దృష్టిపెట్టిన పూజా హెగ్డే

డీజే తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఈ బికినీ భామ టాలీవుడ్‌లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నది. అందులో భాగంగానే తెలుగు భాషపై పట్టు సాధించడం, డ్యాన్సులు, నటనపరంగా మెరుగు పరుచుకొనేందుకు శిక్షణపై దృష్టిపెట్టిందట.

 ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో పూజా

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో పూజా

డీజే తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో పూజా హెగ్డే నటిస్తున్నది. డీజేలో అల్లు అర్జున్ పక్కన ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎన్టీఆర్ వేగాన్ని అందుకోవడానికి ఇప్పటి నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టిందట.

 జూన్‌లో పాటల చిత్రీకరణ

జూన్‌లో పాటల చిత్రీకరణ

జూన్‌లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా పాటల చిత్రీకరణ ఉండవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటిలోగా ఎన్టీఆర్ స్పీడ్‌తో మ్యాచ్ అయ్యేందుకు పూజా సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు

 ముగ్గురు స్టార్ హీరోలతో

ముగ్గురు స్టార్ హీరోలతో

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతోపాటు మహేష్ 25వ చిత్రం, ప్రభాస్ 20 సినిమాకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించడమంటే మాటలు కాదు. ఈ ముగ్గుర్ని ఎలా మేనేజ్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

English summary
Actress Pooja Hegde is now demanded heroine in Tollywood. After DJ, she has become most demanded heroine. Now Pooja working with NTR, Mahesh Babu, Prabhas. To compete NTR, Pooja Hegde is practicing the Dances for Trivikram Srinivas movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X