For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bhavadeeyudu Bhagat Singh కోసం పూజా.. విమర్శలు వస్తున్నా తగ్గకుండా షాకింగ్ రెమ్యునరేషన్

  |

  టాలీవుడ్ లోనే కాక దక్షిణాది భాషల్లో సత్తా చూపించాలని పూజా హెగ్డే ఉవ్విళ్ళూరుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితో నటించిన పూజా హెగ్డేకి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ తగిలిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  బిజీ బిజీ

  బిజీ బిజీ

  కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన పూజా హెగ్డే తల్లిదండ్రులు ముంబైలో సెటిల్ అయ్యారు. అక్కడే పుట్టి పెరిగిన పూజా చదువుకునే రోజుల్లోనే నటన మీద ఆసక్తితో అనేక ఫ్యాషన్ షోస్ లో పాల్గొంది. ఆ క్రేజ్ తో ఆమె ముగమూడి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోయినా తెలుగులో ఒక లైలా కోసం అనే సినిమా ఛాన్స్ రావడానికి అది ఉపయోగపడింది.

  ఇక ఆ తర్వాత తెలుగులో ఆమె ముకుంద అనే సినిమా చేసినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. అయితే రెండేళ్ల తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన మొహంజోదారో అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా ఆడకపోయినా తెలుగులో దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్ కి పెయిర్ గా నటించడంతో మంచి హిట్ గా నిలిచింది.

  ఎక్కదా తగ్గకుండా

  ఎక్కదా తగ్గకుండా

  ఆ సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆ సినిమా తర్వాత వరుసగా రంగస్థలంలో జిగేలు రాణి ఐటెం సాంగ్, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్, ఆచార్య, తమిళంలో సర్కస్, బీస్ట్ లాంటి సినిమాలు ఉన్నాయి.

  అయితే ఇప్పుడు ఆమెకు మరో బంపర్ ఆఫర్ తగిలిందని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పారు, అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉన్నాయి.

  పవన్ సినిమాలో

  పవన్ సినిమాలో

  అలా ఆ షూటింగ్ కి రెడీగా ఉన్న సినిమాలలో హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా ఒకటి. తాజాగా హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కు ఒక మంచి ఫీస్ట్ కూడా ఇస్తూ ఈ సినిమా టైటిల్ కూడా ప్రకటించారు. భవదీయుడు భగత్ సింగ్ అనే పేరు అనౌన్స్ చేశారు. నిజానికి హరీష్ శంకర్ సినిమా షూటింగ్ జూలైలో మొదలు కావాల్సి ఉంది.

  కానీ సెకండ్ వేవ్ దెబ్బకు ప్లాన్లు అన్నీ మారిపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూట్ వాయిదా పడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పాత్రలో పవర్ స్టార్ కనిపించడం ఇదే తొలిసారి. ఇక ఈ భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో పవన్ కల్యాణ్ నటించబోతున్నారు అని సినీ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

  ఆమె అయితేనే కరెక్ట్ అని

  ఆమె అయితేనే కరెక్ట్ అని

  తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయ్యింది అని అంటున్నారు. హరీష్ శంకర్ తో పూజా హెగ్డే గతంలో రెండు సినిమాలు చేసింది. అల్లు అర్జున్ సరసన డిజె సినిమాలో నటించగా అది రాదు గద్దలకొండ గణేష్ లో కూడా ఒక కీలక పాత్రలో నటించింది/ అయితే ఈ సినిమాకు పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక కానుందని ఎప్పటినుంచి ప్రచారం జరుగుతూ ఉండగా అది ఆఖరికి ఖరారైందని అంటున్నారు. పూజా అయితేనే సినిమాకు కరెక్ట్ గా సూటవుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

  Gem Movie Team At Moosapet Theatre | Gem Release On Sept 17
  షాకింగ్ రెమ్యునరేషన్

  షాకింగ్ రెమ్యునరేషన్

  మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పూజా హెగ్డే తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు అనేక విమర్శలు ఎదురవుతున్నాయి తాజాగా రోజా భర్త ఆర్కే సెల్వమణి ప్రెస్ మీట్ పెట్టి మరి పూజ హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో కామెంట్ చేశారు ఆ తర్వాత తెలుగు నిర్మాత నట్టికుమార్ కూడా విమర్శలు గుప్పించిన ఆమె ఏ మాత్రం తగ్గకుండా సినిమా కోసం ఐదు కోట్ల రూపాయలు రీఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం.

  పూజా హెగ్డే మార్కెట్ తమకు కలిసి వస్తుందని భావిస్తున్న దర్శక నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చి ఆమెను సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికీ పూజా హెగ్డే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఒక రకంగా చూస్తే పూజా హెగ్డే ఇప్పుడు దాదాపు అందరు హీరోలతో నటిస్తూ బిజీ బిజీ షెడ్యూల్ గడుపుతోంది..

  English summary
  As per sources Pooja Hegde Has Been Roped in as the Heroine for Power Star Pawan Kalyan Bhavadeeyudu Bhagat Singh, Pooja Hegde Being Paid Huge 5 Crores for the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X