Just In
- 18 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 49 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్‌డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అలా మొదలైంది ఇలా వాయిదా పడింది.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్
డార్లింగ్ ప్రభాస్ సినిమాలంటే కనీసం రెండేళ్ల గ్యాప్ ఉండాలన్నది నియమంగా మారినట్టు కనిపిస్తోంది. అది కావాలని చేస్తున్నారో, అలా జరిగిపోతోందో తెలియడం లేదు కానీ ప్రభాస్ సినిమా షూటింగ్లకు కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతున్నాయట. ప్రభాస్-రాధాకృష్ణ చేయబోతోన్న ప్రాజెక్ట్ అప్‌డేట్స్ అంటూ నిన్నంతా రచ్చచేసిన ఫ్యాన్స్‌ను ఉడికించారు. ఆ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా? అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. చివరకు ప్రభాస్ ఆన్‌లైన్‌లోకి వచ్చి అప్‌డేట్ ఇచ్చేశాడు.

అన్నపూర్ణలో భారీ సెట్..
అయితే ఆ సంబరం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎంతో అట్టహాసంగా మొదలు పెట్టిన ఈ మూడో షెడ్యూల్‌కు ఆదిలోని కష్టాలు మొదలయ్యాయి. నిన్న అన్నపూర్ణలో భారీ సెట్ వేసి అంతా రంగం సిద్దం చేశారట. ఈ షెడ్యూల్‌లో పూజా హెగ్డే-ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరించాలనేది ప్లాన్ అంట.

పూజకు అనారోగ్యం..
అన్నపూర్ణ స్టుడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా మూడో షెడ్యూల్ నిన్న మొదలైంది. నేటి నుంచి ప్రభాస్-పూజా హెగ్డే మధ్య సన్నివేశాలు తీయాలని అనుకున్నారట. కానీ అనారోగ్య కారణాల వల్ల పూజా హెగ్డే షూటింగ్‌కు రావడం లేదని సమాచారం. దీంతో ఈ షూటింగ్ వాయిదాపడిందని టాక్. అయితే షెడ్యూల్ మాత్రం కాన్సిల్ అవ్వలేదని తెలుస్తోంది.

పూజాతో సంబంధం లేని సీన్స్..
ఆమె కాంబినేషన్ లేకుండా అక్కడ ప్లాన్ చేసిన సన్నివేశాలను కానిచ్చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ తరువాత షెడ్యూల్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారట. అయితే భారీ సెట్ల నిర్మాణం పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని సమాచారం. మరీ ఆలస్యమయ్యేలా వుంటే, ముందు ఆస్ట్రియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకు రావాలనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

గతంలోనూ ఇలాగే..
గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఆస్ట్రియా షెడ్యూల్‌ను ఓసారి క్యాన్సిల్ చేసుకుని తిరిగివచ్చారు. ఆ సమయంలో పూజా హెగ్డే అనారోగ్యం బారిన పడడంతో షూటింగ్ జరపడం కుదరలేదట. ఆస్ట్రియా షెడ్యూల్ లో ఎక్కువ భాగం సన్నివేశాలు ప్రభాస్ - పూజ పైన చిత్రీకరించాల్సి ఉందట. అయితే హై ఫీవర్ తో పూజ బాధ పడుతూ ఉండడంతో షూటింగ్ రద్దు చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.