ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... ఆ విషయంలో అందరికంటే ముందున్న ప్రభాస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చిన్న సినిమాలు చేయడం లేదు. ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత సాహో సినిమా చేసినా ఆయన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమా కరోనా కారణంగా లేట్ అవుతోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇంకా షూట్ చేయాల్సి ఉంది. అయితే తాజాగా షూట్ కి సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

వరుస సినిమాలు
రాధేశ్యామ్ సినిమా లైన్ లో ఉండగానే ఆయన మరో మూడు సినిమాలు అనౌన్స్ చేశారు. నాగ్అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ అన్ని సినిమాల విషయం పక్కన పెడితే ఆదిపురుష్ టీమ్‌ను మాత్రం వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి.

‘ఆదిపురుష్’ కష్టాలు
'ఆదిపురుష్' సినిమా మొదలయ్యాక అగ్ని ప్రమాదం మొదలు, మహారాష్ట్ర లాక్ డౌన్ దాకా అన్నీ ఇబ్బందులే. ఆ మధ్యన హైదరాబాద్‌లో షూటింగ్ ప్లాన్ చేసిన యూనిట్‌కు తెలంగాణలోనూ లాక్ డౌన్ ప్రకటించటంతో మరో షాక్ తగిలినట్లు అయింది. అలా మొత్తం మీద అనేక సమస్యలతో ఈ సినిమా తంటాలు పడింది. అయితే ఇప్పుడు ఊరట లభించేలా కేసులు తగ్గుతున్నాయి.

బ్యాక్ టు ముంబై
తాజాగా ముంబై నగరంలో కోవిడ్ -19 కేసులు క్రమంగా తగ్గుతున్నందున ఇప్పుడు ఆదిపురుష్ బృందం తిరిగి ముంబైకి వెళుతుందనేది తాజా సమాచారం. ఇప్పటికే 25 శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ఈ నెల 16 నుంచి తిరిగి ప్రారంభం కానుందని అంటున్నారు. ముంబైలో షూటింగ్ పట్ల ప్రభాస్ సంతోషంగా లేడని, హైదరాబాద్ లో షూటింగ్ పట్ల ఆయన ఆసక్తి చూపిస్తున్నాడని అంటున్నారు.

రెండు సెట్స్ కూడా
అయితే, దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఇప్పటికే ముంబైలో రెండు సెట్లను కూడా నిర్మించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపికయ్యారు.

ప్రభాస్ లేడు కానీ
ఇక ప్రభాస్ షూట్ లో పాల్గొనడం లేదు కానీ సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని అంటున్నారు. లంకా రాజ్యాన్ని VFX ఉపయోగించి పునర్నిర్మిస్తున్నారని అంటున్నారు. ప్రభాస్ షూట్ లో పాల్గొనకపోయినా కరోనా రెండవ వేవ్ తర్వాత షూట్ మొదలు పెట్టిన సినిమాల్లో ఈ సినిమా ముందు వరుసలో నిలుస్తోంది.


Click it and Unblock the Notifications











