»   » హిస్టారికల్ మూవీ ‘ప్రతాపరుద్రుడు’లో ప్రభాస్?

హిస్టారికల్ మూవీ ‘ప్రతాపరుద్రుడు’లో ప్రభాస్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి జీవితం ఆధారంగా ‘రుద్రమదేవి' చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడు గుణశేఖర్.....దానికి సీక్వెల్ గా ‘ప్రతాపరుద్రుడు' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రభాస్ తో చేయాలని గుణశేఖర్ డిసైడ్ అయినట్లు సమాచారం.

ప్రభాస్ ప్లాప్ సినిమాకు ఊహించని రెస్పాన్స్!

బాహుబలి మూవీలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చూసాక ఈ సినిమాకు ప్రభాస్ అయితేనే సూటవుతాడని గుణశేఖర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘రుద్రమదేవి' చిత్రం భాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో గుణశేఖర్ ప్రతిపాదనకు ప్రభాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

బాహుబలి 2.... నుండి ఫస్ట్ స్నాప్ ఇదే (ఫోటో)

Prabhas as Pratapa Rudrudu?

ప్రస్తుతం ప్రభాస్ ‘బాహుబలి' పార్ట్ 2 షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. 'బాహుబలి' పార్ట్ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2015 డిసెంబర్లో షూటింగ్ మొదలైంది. ఇటీవలే కేరళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో యూ ఎస్ షెడ్యూల్‌కు వెళ్ళనున్న రాజమౌళి అండ్ టీం ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, ఈ ఏడాది చివరిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Grapevine is that Prabhas is in contention to play the titular role of director Gunasekhar's new movie Pratapa Rudrudu, a sequel to historical drama Rudhramadevi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu