»   » బ్యాంకాక్ ఫైట్ ప్రభాస్ సెంటిమెంటా?

బ్యాంకాక్ ఫైట్ ప్రభాస్ సెంటిమెంటా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ చిత్రం క్లైమాక్స్ లో ప్రబాస్. ఫారిన్ ఫైటర్స్ తో బ్యాంకాక్ లో భారీ ఫైట్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఇప్పుడు మళ్ళీ మరో ఫైట్ బ్యాంకాక్ లో చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సారి డార్లింగ్ చిత్రం కోసం. తొలిప్రేమ ఫేమ్ కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. పీటర్ హెయిన్స్ ఈ ఫైట్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఫారిన్ ఫైటర్స్ చాలా మంది ఈ ఫైట్ లో పాల్గొంటున్నారు.గత పది రోజులుగా జరుగుతున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఆండ్రూ కెమెరా అందిస్తున్నాడు. మార్చిలో ఈ చిత్రంలో రిలీజ్ అవబోతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu