Prabhas Spirit: స్పిరిట్ లో యానిమల్ సీన్.. ప్రభాస్ ను అలా చూపించబోతున్నారా?
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం 'స్పిరిట్' (Spirit). ఇప్పటికే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్ కాబోతుందని అని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఆ విషయమేమిటీ?
'స్పిరిట్' సినిమా కథ, నటీనటులు, కాన్సెప్ట్ అన్ని విషయాల్లో పాన్-వరల్డ్ లెవెల్‌లో రూపొందుతోంది. ఇందులో వర్డల్ వైడ్ ఫేమ్ కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. 'ట్రైన్ టు బుసాన్', 'ఎటర్నల్స్' వంటి సినిమాల ద్వారా హాలీవుడ్, కొరియన్ ప్రేక్షకులకి పరిచయం అయిన డాన్ లీ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇండియన్ హీరో ప్రభాస్, కొరియన్ స్టార్ డాన్ లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం భారతీయ సినిమాకే ఓ చారిత్రాత్మక ఘట్టంగా భావిస్తున్నారు సినీ వర్గాలు.

టీజర్‌తో భారీ అంచనాలు
ఇటీవల విడుదలైన 'స్పిరిట్' ఆడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. "భారతదేశంలోనే అతిపెద్ద స్టార్" అని వాయిస్ ఓవర్ ద్వారా చెప్పడం అభిమానుల్లో నయా జోష్ వచ్చింది. మరోవైపు ప్రకాశ్‌రాజ్ వాయిస్‌ఓవర్‌లో ఉన్న ఓ బోల్డ్ డైలాగ్ పెద్ద చర్చకు దారితీసింది "ఖైదీని బట్టలూడదీసి టెస్టులకు పంపండి" అనే లైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సినిమాలో ఉండే బోల్డ్ సీన్‌కి హింట్ ఇస్తోందని అభిమానులు భావిస్తున్నారు.
ప్రభాస్ బోల్డ్ అవతారం?
సినీ వర్గాల సమాచారం ప్రకారం, 'స్పిరిట్' చిత్రంలో ప్రభాస్ ఓ కీలక సన్నివేశంలో న్యూడ్ షాట్ ఇవ్వనున్నారని టాక్. ఈ సీన్ ఒక పోలీస్ విచారణ సీక్వెన్స్‌లో భాగమని సమాచారం. 'యానిమల్' సినిమాలో రణ్‌బీర్ కపూర్ బోల్డ్ సీన్ చేసినట్లు, అదే విధంగా ప్రభాస్ కూడా చూపించబోతున్నారా? అనే ఆసక్తి నెలకొంది. అయితే ఇది నిజంగా ప్రభాస్‌నే చేస్తారా? లేక బాడీ డబుల్ ద్వారా చూపిస్తారా? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఈ తరహా రిస్క్ తీసుకోవడం సందీప్ రెడ్డి వంగా స్టైల్ అని అందరూ అంటున్నారు.
వంగా విజన్
'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా బోల్డ్ ఎమోషన్స్, రియలిస్టిక్ యాక్టింగ్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆయన సినిమాల్లో హీరోలు ఎప్పుడూ గ్రే షేడ్‌లో కనిపిస్తారు. ఇప్పుడు 'స్పిరిట్'లో కూడా అలాంటి కొత్త వైపు చూపించబోతున్నారని టాక్. పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ రఫ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తారని పోస్టర్లు సూచిస్తున్నాయి. 'యానిమల్' మూవీతో పాపులర్ అయిన త్రిప్తి డిమ్రీ, ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ - త్రిప్తి కెమిస్ట్రీ, వంగా డైరెక్షన్ కలయిక ఈ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ పెరిగింది.
భారీ స్థాయిలో విడుదల
'స్పిరిట్' చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో ఇండియన్ సినిమా రిలీజ్ కావడం చాలా అరుదు. 2026లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ హైప్స్ 'స్పిరిట్' సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త మైలురాయిగా నిలవడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











