»   »  మహేష్ సలహాతోనే ప్రభాస్ డేట్స్ లాక్ ?

మహేష్ సలహాతోనే ప్రభాస్ డేట్స్ లాక్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్ వంటి స్టార్ హీరో ..బాహుబలి -2 తర్వాత దొరుకుతాడా..అప్పటికి ఏ స్ధాయిలో క్రేజ్ ఉంటుందో ..అందుకే ముందు చూపుతో మహేష్ తో శ్రీమంతుడు చిత్రం చేసిన మైత్రీ మూవీస్ వారు, ప్రభాస్ డేట్స్ ని లాక్ చేసేసినట్లు సమాచారం.

మైత్రీ మూవీస్ కు, మహేష్ కు ఉన్న అనుభంధంతో ..మహేష్ బాబు ఈ ఆలోచన ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మైత్రీ మూవీస్ వారు తాము చేయబోయే చిత్రాల గురించి, హీరోల డేట్స్ గురించి మహేష్ తో మాట్లాడి, ఆయన సలహాలు తీసుకుంటారని టాక్. ఈ విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. ఏదో ఒక హీరో అండ ఉంటేనే ఇండస్ట్రీలో పచ్చగా ఉండగలరనే విషయం మైత్రీ మూవీస్ కు తెలుసు అంటున్నారు.

మైత్రీ మూవిస్ వారు...ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరక్షన్ లో జనతా గ్యారేజ్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తవగానే ప్రభాస్ తో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేసి మరీ బుక్ చేసుకున్నారు. దర్శకుడుని కూడా పైనల్ చేయలేదు. ప్రభాస్ డేట్స్ తీసుకుని తమ దగ్గర పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రభాస్ కు భారీగానే అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

Prabhas dates to Mytri movies?

బాహుబలి అయిన తర్వాత ప్రభాస్ కొంచెం రెస్ట్ తీసుకుంటాడని భావించారుఅంతా, కానీ ఇంతలోనే ఎప్పుడో రాబోయో 2017,18 సంవత్సరాల కోసం అప్పుడే బుక్ అయిపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది ప్రభాస్ ఫ్యాన్స్ కు. అయితే తమ హీరోకు వస్తున్న క్రేజ్ చూసి వారు ఆనందంతో తల మునకలు అవుతున్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్...వెంటనే సుజిత్ సేన్ (రన్ రాజా రన్ దర్శకుడు) తో యువి క్రియేషన్స్ లో చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా ప్రభాస్ కనిపిస్తాడని చెప్తున్నారు. బాహుబలి తర్వాత చేసే సినిమాలపై చాలా అంచనాలు ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా దర్శకులు ప్లాన్ చేసుకోగలిగాలి మరి.

English summary
Srimanthudu producers have convinced other star hero Prabhas to work under their banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu