»   »  దశరధ్ దర్శకత్వంలో ప్రభాస్ ?

దశరధ్ దర్శకత్వంలో ప్రభాస్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhas
ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్ఛనీయాంశంగా ఉన్న హాట్ టాపిక్ ఇది. ఫైర్ బ్రాండ్ సినిమాలతో ముందుకెళ్తున్న ప్రభాస్ , పక్కా ఫీల్ తో సున్నితంగా సినిమాలు రూపొందించే దశరధ్ కాంభినేషన్ అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అందులోనూ ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నవాళ్ళే కావటం తో మంచి కసితో ప్రాజెక్టును చేస్తారని కొందరంటుంటే...మరికొందరు ఆ ఇద్దరూ...కలసి సినిమానా అని పెదవి విరిస్తున్నారు.

అందులోనూ దశరధ్ గతంలో యాక్షన్ సినిమాగా మనోజ్ కుమార్ తో 'శ్రీ' ని రూపొందించాడు. కానీ అది అనూహ్యంగా అపజయం పాలయ్యింది. ప్రభాస్ 'బుజ్జిగాడు' అంటూ పూరితో కలిసి వచ్చినా భాక్సాఫీసుని మెప్పించలేకపోయాడు. అయినా దశరధ్ ఈ మధ్య వి.వి.వినాయక్ తో కలసి ఎన్టీఆర్ కి కథ వండటంలో హెల్ప్ చేసాడని వార్తలు రావటం కొంతవరకు ఊరట కలిస్తోంది ప్రభాస్ అభిమానులకు...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X