Deepika Padukone తీరుపై ప్రభాస్‌ తీవ్ర అసంతృప్తి.. ప్రాజెక్ట్ K షూటింగ్‌కు అలాంటి సమస్యలు?

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్యాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో దీపిక పదుకోన్ అనారోగ్యం కారణంగా అనేక సమస్యలను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఎదుర్కొంటున్నారనే వార్త మీడియాలో రకరకాలుగా ప్రచారంలో ఉంది. గతవారం హైదరాబాద్‌లో జరుగుతున్న మూవీ షూటింగులో దీపిక తీవ్ర అనారోగ్యం పాలు కావడం తెలిసిందే. అయితే గతంలో ఆమె ఎదుర్కొన్న వ్యాధి మరోసారి తిరగదోడిందనే విషయం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ఆమె అనారోగ్యం కారణంగా షూటింగ్‌ సవ్యంగా సాగడం లేదు. దాని వల్ల ప్రభాస్‌కు సినిమా కష్టాలు మొదలయ్యాయి అనేది వైరల్ అవుతున్నది. దీపిక పదుకోన్‌ ఎదుర్కొంటున్న వ్యాధి ఏమిటి? ఆమె ప్రభాస్‌కు ఎదురైన సమస్యలు ఏమిటనే విషయంలోకి వెళితే..

దీపికకు మానసిక రుగ్మతలు

దీపికకు మానసిక రుగ్మతలు

దీపిక పదుకోన్‌ గతంలో మానసిక సమస్యలను ఎదుర్కోవడం తెలిసిందే. అయితే మళ్లీ అలాంటి మానసిక రుగ్మత దీపికను వెంటాడుతున్నది. ఆ సమస్య వల్లే ప్రాజెక్ట్ K షూటింగ్‌లో పానిక్ ఎటాక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో అపాయం తప్పింది. అప్పటి నుంచి ఆమె మానసిక రుగ్మతకు ట్రీట్‌మెంట్ తీసుకొంటూ మెడిసిన్స్ వాడుతున్నారు అని యూనిట్ వర్గాలు తెలిపారు.

ప్రభాస్ సినిమా కష్టాలు?

ప్రభాస్ సినిమా కష్టాలు?

దీపికకు మానసిక రుగ్మత తర్వాత హార్ట్ బీట్ పెరిగిపోయింది. దానిని కంట్రోల్ చేసేందుకు మెడిసిన్స్ వాడుతున్నారు. ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఆమె చురుకుగా షూటింగులో పాల్గొనలేకపోతున్నది. ఆ కారణంగా షూటింగులో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆమె అనారోగ్యం కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతున్నది. ఇది ప్రభాస్‌కు తలనొప్పిగా మారింది అనే వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

షూటింగులో అవాంతరాలు రావడంతో

షూటింగులో అవాంతరాలు రావడంతో

అయితే దీపిక పదుకోన్ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ప్రభాస్ ఆందోళన చెందాడు. అయితే ఆమె ఆరోగ్యం కుదటపడే వరకు షూటింగ్ క్యాన్సిల్ చేద్దామని నిర్ణయం తీసుకొన్నాడు. కానీ దీపిక షూటింగ్‌కు రెడీ కావడంతో ఆ నిర్ణయాన్ని యూనిట్ వాయిదా వేసుకొన్నారు.

అయితే దీపిక పరిస్థితి మెరుగు కాకపోవడంతో షూటింగులో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దాంతో ప్రభాస్ హ్యాపీగా లేడు. షూటింగ్ సవ్యంగా సాగకపోవడంతో ఆయన ఆందోళన చెందుతున్నాడు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

దీపిక రూమర్లపై ఖండన

దీపిక రూమర్లపై ఖండన

అయితే దీపిక వల్ల ప్రాజెక్ట్ K షూటింగులో సమస్యలు ఏర్పడుతున్నాయనే విషయాన్ని యూనిట్‌లోని కీలక వ్యక్తులు ఖండించారు. దీపిక వల్ల ఎలాంటి సమస్యలు లేవు. దీపిక చాలా ప్రొఫెషనల్‌గా వ్యహరిస్తున్నారు. ఆమె కూడా నిర్మాత కావడం వల్ల.. షూటింగ్‌ సవ్యంగా సాగకపోవడం వల్ల కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకొని.. కష్టాలను అధిగమించి షూటింగులో పాల్గొంటున్నారు అని చెబుతున్నారు.

దీపిక, ప్రభాస్ మధ్య ..

దీపిక, ప్రభాస్ మధ్య ..

ప్రాజెక్టుK షూటింగులో దీపిక, ప్రభాస్ మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు. వారిద్దరూ చాలా కూల్‌గా షూటింగ్ చేస్తున్నారు. దీపికకు ప్రభాస్ అండగా ఉంటూ.. ఆమెను మానసికంగా ఉత్సాహ పరుస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేస్తున్నారు. మీడియాలో ప్రచారం అవుతున్న రూమర్లలో ఎలాంటి వాస్తవం లేదు అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X