»   » ప్లాప్ డైరక్టర్ దర్శకత్వంలో ప్రభాస్!

ప్లాప్ డైరక్టర్ దర్శకత్వంలో ప్రభాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి లారెన్స్ ఓ మంచి స్టోరీ లైన్ చెప్పి పడగొట్టేశాడట. నిజానికి 'సూపర్ కౌబాయ్" చిత్రంతో హీరో అయిపోవాలనే ఆరాటంతో అందరి విమర్శలకూ గురయ్యాడే కానీ, డాన్స్ మాస్టర్ గా, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ గా లారెన్స్ ది సూపర్ సక్సెస్ ఫుల్ కెరీరే. ముని, మాస్, స్టైల్, డాన్, సూపర్ కౌబాయ్ చిత్రాలతో డైరెక్టర్ గా వరుస పరాజయాలు సాధించిన లారెన్స్ ఇప్పుడిక పూర్తిగా దర్శకత్వం పై దష్టి పెట్టాలనే నిర్ణయం తీసుకున్నాడు.

అదే ఆలోచనతో ఈ మద్యన ప్రభాస్ ని కలిసి ఓ మాస్ ఎంటర్ టైనింగ్ సబ్జెక్ట్ చెప్పిన లారెన్స్ కి యంగ్ రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. సంతోషం, స్వాగతం, మరియు శ్రీ సినిమాలు తీసిన దశరథ్ దర్శకత్వంలో సినిమా పూర్తయ్యాక, కె రాఘవేంద్ర రావు నిర్మాణంలో రాజమౌళి సినిమా చెయ్యనున్న ప్రభాస్ ఆ సినిమా రూపుదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందనే ఆలోచనతో లారెన్ప్ డైరెక్షన్ లో కూడా సినిమాని సైమల్టేనియస్ గా చేసేస్తాడట. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే రేంజ్ లో పెద్ద కమర్షియల్ సినిమా చేస్తానని ఇండస్ట్రీలోని తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు లారెన్స్. అయితే డార్లింగ్ ప్రభాస్ కి హిట్టే ఇస్తాడో, లేక తనదైన శైలిలో ఫ్లాపే ఇస్తాడో వేచి చూడాల్సిందే. ఏదైతేనేం ఒకేసారి ప్రభాస్ మూడు సినిమాల విశేషాలు తెలియడం మాత్రం 'డార్టింగ్" ఫ్యాన్స్ కి పండగలాగే ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu