For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరో కధకి ప్రభాస్ ఫిదా.. ఈ సారి లేడీ డైరెక్టర్ తో.. అంచనాలకి మించి ఉండేలా!

  |

  బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తం అయిపోయింది. తెలుగులో సినిమా చేస్తే దానిని తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికి కావాల్సిందల్లా భారీ బడ్జెట్, ఒక బడా హీరో, మంచి కథ, దాన్ని హ్యాండిల్ చేయగల దర్శకుడు. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఆయన తాజాగా మరో మహిళా దర్శకురాలు చెప్పిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

  ప్యాన్ ఇండియా రేంజ్

  ప్యాన్ ఇండియా రేంజ్

  బాహుబలి బిగినింగ్, బాహుబలి కంక్లూజన్ సినిమాల దెబ్బకి ప్రభాస్ కీర్తి ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోయింది. సినిమా దర్శకుడు రాజమౌళికి ఎంత గుర్తింపు దక్కిందో ప్రభాస్ కి కూడా అంతే మేర గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి ఆయన చేస్తున్న దాదాపు ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన బాహుబలి తీసిన వెంటనే సాహో అనే సినిమా సొంత ప్రొడక్షన్ లో చేశాడు. ఈ సినిమా మాత్రం ప్రభాస్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న తదుపరి సినిమాల విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

  రాధేశ్యామ్ టెన్షన్

  రాధేశ్యామ్ టెన్షన్


  ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు.. పిరియాడిక్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ సాహో ఎఫెక్ట్ తో ఈ సినిమాలో ప్రభాస్ అనేక మార్పులు చేర్పులు సూచించడంతో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.

  అయినా వెంటవెంటనే మూడు

  అయినా వెంటవెంటనే మూడు


  ఇక రాధేశ్యామ్ సినిమా సెట్స్ మీద ఉండగానే ప్రభాస్ దాదాపు మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు. ముందుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నట్లు ప్రభాస్ నుంచి ప్రకటన వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇవి కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సాలిడ్ మాస్ మూవీ కూడా చేస్తున్నాడు. ఇన్ని సినిమాలతో బిజీగా ఉండగా ప్రభాస్ మరిన్ని సినిమాల కథలు వింటున్నాడు.

  దిల్ రాజుతో?

  దిల్ రాజుతో?

  ఇప్పటికే ఆయన దిల్ రాజుతో ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు అని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. దిల్ రాజు కాంపౌండ్లో ఖాళీగా ఉన్న వంశీ పైడిపల్లి లాంటి దర్శకులతో ప్రభాస్ తో దిల్ రాజు ఒక పాన్ ఇండియా మూవీ చేయించాలని దిల్ రాజు భావిస్తున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాల మీద ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ ప్రభాస్ ను తాజాగా కలిసిన ఒక మహిళా దర్శకురాలు ఆయనకు కథ చెప్పినట్లు సమాచారం.

  Vijay Devarakonda Rejected Star Directors Deal | Liger Movie || Filmibeat Telugu
  సుధ కొంగర కధ నచ్చడంతో

  సుధ కొంగర కధ నచ్చడంతో

  గతంలో గురు, ఆకాశమే నీ హద్దురా అనే సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సుధ కొంగర ప్రభాస్ ను కలిసి ఒక సోషల్ డ్రామా సబ్జెక్ట్ ను నెరేట్ చేసినట్లు సమాచారం. నెరేషన్ వచ్చిన ప్రభాస్ ఫైనల్ డ్రాఫ్ట్ తో రమ్మని ఆమెను కోరినట్లు సమాచారం. బౌండెడ్ స్క్రిప్ట్ విన్నాక ప్రభాస్ కి నచ్చితే అప్పుడు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతం ఆయన ఒప్పుకున్నా సినిమాలు పూర్తి చేయాలి కాబట్టి 2023 నుంచి ఈ సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

  English summary
  As per latest buzz, female filmmaker Sudha Kongara has narrated a story to Prabhas. Sudha met with Prabhas recently and narrated a social drama subject to the latter. Prabhas liked the idea and asked Sudha to come up with the final draft.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X