»   » ప్రభాస్ 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం కథ ఏమిటంటే...

ప్రభాస్ 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం కథ ఏమిటంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ వ్యక్తైనా చెడు అనిపించుకోవడానికి క్షణకాలం పట్టదు. అదే మంచిపేరు తెచ్చుకోవాలంటే ఒక వ్యక్తిని, అతని గుణగణాలను ఎంతోకాలం గమనిస్తే కానీ అతనికి గుడ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరు. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అందరిచేత పర్‌ఫెక్ట్‌ అని ఎలా అనిపించుకున్నాడన్నది 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రం కథ అంటున్నారు. ప్రభాస్‌ హీరోగా, కాజల్‌, తాప్సీ హీరోయిన్స్ గా దశరథ్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, మలేషియా, కేరళ, హైదరాబాద్‌, అహోబిలం లొకేషన్లలో ఈ చిత్రం షూటింగ్‌ చేశారు. యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌ అంశాలతో ఈ చిత్రాన్ని మలిచారు. త్వరలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దిల్ రాజు కధా రచయిత అవతారమెత్తారు. కె. విశ్వనాథ్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, నాజర్, షాయాజి షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మూలకథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, స్క్రీన్‌ప్లే: పి. హరి, కెమెరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: దిల్ రాజు, కథ-దర్శకత్వం: దశరథ్.

English summary
"Mr Perfect" starring Prabhas and Kajal Agarwal is the 12th film under Dil Raju’s Sri Venkateswara Creations banner. Dasarath of ‘Santhosham’ fame is directing this flick and the shooting is almost complete. The unit is presently busy with post production works. Dil Raju informed that the audio will be released shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu