»   » ప్రభాస్ ని భయపెట్టిన దిల్ రాజు...అతనితో పనిచేయకూడదనుకొన్నా..

ప్రభాస్ ని భయపెట్టిన దిల్ రాజు...అతనితో పనిచేయకూడదనుకొన్నా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో ప్రభాస్ చాలా మితభాషి. పెద్దనాన్న హీరో కృష్ణంరాజు వారసుడిగా, టాలీవుడ్ లో హీరోగా ప్రభాస్ మంచి పేరును సంపాదించుకున్నాడు. అదేసమయంలో చాలా చిన్న డిస్ట్రీబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించటం, దిల్ రాజు పట్టుకున్నదల్లా బంగారం కావటం జరగుతుంది. కాగా హీరో ప్రభాస్ కు నచ్చని నిర్మాత ఎవరైనా ఉన్నారా..? అంటే అతనితో ఇక జీవితం లో సినిమా చేయకూడదు అన్నంత కాశి పెంచుకున్న స్థాయి లో ప్రభాస్ ను హర్ట్ చేసిన నిర్మాత ఎవరైనా ఉన్నారా అని అంటే ఒకే ఒక్క పేరు వినబడుతుంది. ఎవరా నిర్మాత అని అంటే.. ప్రభాస్ తో రెండు సినిమాలు చేసిన దిల్ రాజు. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయం గా ఓ మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. ఆయన ఎం చెప్పాడన్టె..

దిల్ రాజు ప్రభాస్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలన్న ఉద్దేశ్యంతో ప్రభాస్ ను కలసి, ఒక ఫ్యామిలీ కథను చెప్పటం జరిగింది. దిల్ రాజు మాటలు, ఏకవచన సంభోధనతో ప్రభాస్ కి దిల్ రాజు అంటే భయం పట్టుకుంది. ఇదేమిటి ఈ నిర్మాత మంచిమాట లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు. రేపు సినిమా షూటింగ్ లో ఇంకెలా మాట్లాడుతాడోనని ప్రభాస్ చాలా భయపడ్డాడట..!ఆ తర్వాత ప్రభాస్ చాలా సినిమాలు నటించటం దిల్ రాజు, ప్రభాస్ అనేక ఫంక్షన్స్ లో కలిసి మాట్లాడటంతో దిల్ రాజు మాట్లాడే విధానం అలా ఉంటుంది తప్పితే, మనస్సు చాలా మంచిది అని గ్రహించి ఇద్దరు కలసిపోయారు. ఆ తర్వాత 'మున్నా" చేశాను. ఆ సినిమా ఫస్ట్ షో అవ్వగానే… నా దగ్గరకొచ్చి 'మీకు అనుకున్న సక్సెస్ ఇవ్వలేకపోయాను" అన్నారు. అప్పుడర్థమైంది… ఆయన ఎంత జన్యూన్ పర్సనో. నా నిర్మాతల్లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ అతను.. అని అన్నాడు ప్రభాస్. అంతటితో ఆగక ప్రభాస్ తో సినిమా మిస్టర్ ఫర్ ఫెక్ట్ ప్రకటించటం మిస్టర్ ఫర్ ఫెక్ట్ తీయటం, ఈ సినిమా విజయవంతం కావటం జరిగిపోయింది.

English summary
Young Rebel Star Prabhas recently speaking Media said, "I met Dil Raju first time when he came to invite me for a function of film 'Dil' - I didn't like the way he invited me. I decided not to work with him at the time only. But I did 'Munna' for some reason.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu