TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
సల్మాన్ ఖాన్, మహేష్ బాబు లాగే.. రూల్స్ పెడుతున్న ప్రభాస్!
సినిమా నిర్మాణం విషయంలో నటీనటులు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి పాత రోజుల్లో తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హీరోలే నిర్మాతలుగా మారిపోతున్నారు. సినిమా బిజినెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పెరుగుతున్న మార్కెట్ కారణంగా హీరోలు కూడా వ్యాపార మెళుకువలు నేర్చుకుంటున్నారు. టాలీవుడ్ బడా హీరోల్లో కూడా ఈ అలవాటు పెరుగుతోంది. ఏ విషయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
డీల్ కుదరాలంటే
తనతో సినిమా చేయడానికి వచ్చే నిర్మాతలకు ప్రభాస్ ముందుకుగా కొన్ని రూల్స్ పెడుతున్నాడట. అందులో ముఖ్యంగా చిత్ర నిర్మాణం గురించి. తన చిత్రాన్ని ఎవరు నిర్మించినా తప్పనిసరిగా యూవీ క్రియేషన్స్ సంస్థకు ఎంతో కొంత వాటా ఇవ్వాల్సిందే అని ప్రభాస్ పట్టుబడుతున్నాడట. ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే సినిమాలకు సైన్ చేస్తున్నాడని, లేకుంటే నో చెబుతున్నాడని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ వాళ్ళు ప్రభాస్ కు అత్యంత సన్నిహితులు.
ఆ బ్యానర్‌లోనే
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో చిత్రాన్ని, ఆ తదుపరి రాబోతున్న రాధాకృష్ణ దర్శత్వంలో చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మాతలే నిర్మిస్తుండడం విశేషం. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కు హోమ్ బ్యానర్ లాంటిది. దీనితో తన ప్రతి చిత్రంలో ఆ సంస్థ భాగస్వామ్యం ఉండాలని ప్రభాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. ఇకపై ప్రభాస్ ప్రతి చిత్రం మినిమమ్ 100 కోట్ల బడ్జెట్ లో రూపొందే అవకాశాలు ఉన్నాయి.
సల్మాన్ ఖాన్ కూడా
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ పద్దతిని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు. తన ప్రతి చిత్రంలో సొంత నిర్మాణ సంస్థ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ వాటా తప్పనిసరిగా ఉంటుంది. బిజినెస్ లో సల్మాన్ ఖాన్ వాటా తీసుకుంటాడు. ఇక టాలీవుడ్ లో మహేష్ బాబు కూడా దాదాపుగా ఇదే పని చేస్తున్నాడు. శ్రీమంతుడు చిత్రం నుంచి మహేష్ బాబు కూడా ప్రొడక్షన్ లో భాగమవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల క్రితం నుంచే సినిమా నిర్మాణంలో వాటా తీసుకునే వారనే సమాచారం ఉంది.
రెండు చిత్రాలతో
ఇక ప్రభాస్ బాహుబలి తర్వాత ఒక్క చిత్రాన్ని కూడా విడుదల చేయలేదు. దీనితో ప్రభాస్ అభిమానులు సాహో కోసం ఎదురుచూస్తున్నారు. సాహో 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కే ప్రేమ కథా చిత్రం కూడా ఈ ఏడాదే విడుదలవుతుందట.