»   » మాస్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టేనా..?

మాస్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఓకే అయినట్టేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో విజయాలను అందుకుంటున్న అతికొద్ది దర్శకుల్లో బోయపాటి శ్రీనివాస్‌ ఒకరు. భ‌ద్ర‌, తుల‌సి, సింహా,లెజెండ్‌, ద‌మ్ము లాంటి మాస్‌ యాక్షన్‌ సినిమాలు తీసిన ఆయన. రీసెంట్‌గా స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమా తీసి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఇక త్వరలోనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్న సినిమా ఇంకా సెట్స్‌పైకి కూడా వెళ్లకుండానే. తరువాత బోయపాటి డైరెక్షన్‌లో ప్రభాస్, మహేశ్ బాబు నటిస్తారనే ఊహాగానాలు సినీవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి 'సరైనోడు' కంటే ముందే మహేశ్ బాబుతో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని వార్తలొచ్చాయ్. అయితే ఆ ప్రాజెక్ట్ ఏవేవో కారణాలతో వర్కౌట్ కాలేదు. ఇక అంతటితో ఆ ప్రయత్నాలు ఆపేసిన బోయ పాటి బన్నీతో 'సరైనోడు' తెరకెక్కించి సక్సెస్ సాధించాడు.

Prabhas Next Film with Boyapati Srinu

ఇప్పుడు బోయపాటితో సినిమాతో చేసేందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం 'బాహుబలి-2' షూటింగ్‌లో బిజీగా ఉన్న హీరో ప్రభాస్. ఆ తరువాత ఎవరి డైరెక్షన్‌లో నటిస్తారనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు.

అయితే. రీసెంట్‌గా బోయపాటి. ప్రభాస్‌ను కలిసి కథ ఓకే చేయించుకున్నాడని. 'బాహుబలి' సీక్వెల్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా సెట్స్ మీదకి వెళ్తుందనీ అంటున్నారు. అయితే ఇప్పటికి ప్రభాస్ గానీ,బోయపాటిగానీ ఈ విశయమై ఏ క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గానే ఉన్నారు మరి.

English summary
As per the inside buzz, Boyapati would direct Prabhas in his up next film after his present commitment with young hero Bellamkonda Sreenivas.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu