ప్రభాస్ ఫుల్ ఖుష్…తెగ నచ్చేసిందట.. అంతా ఆమె గురించే చర్చ!

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన పూర్తిగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశారు. బాహుబలి తర్వాత సొంత ప్రొడక్షన్ అయిన యు.వి ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి సాహో అనే సినిమా చేశారు. ఇక ప్రస్తుతం అదే సంస్థతో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాక ఇప్పటికే ఆయన నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే తాజాగా రాధే శ్యామ్ సినిమా గురించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

రాధేశ్యామ్ కి మార్పులు

రాధేశ్యామ్ కి మార్పులు

బాహుబలి సిరీస్ చేసిన తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. దాదాపు ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి తర్వాత ఆయన సాహో అనే సినిమా చేశారు. సుజిత్ దర్శకత్వంలో యు.వి.ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఊహించినంత ఆదరణ దక్కించుకోలేక పోయింది. కలెక్షన్లు బాగానే వచ్చిన సినిమా టాక్ మాత్రం పాజిటివ్ గా రాలేదు. ఈ సినిమా దెబ్బతో ఆయన ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా మార్పులు చేర్పులు సూచించారు.

సాహో దెబ్బతో

సాహో దెబ్బతో


రాధేశ్యామ్ కి మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ లేట్ అవుతోంది. ఇప్పటికి కూడా కొంతమేర ప్యాచ్ వర్క్ ఈ సినిమాకు మిగిలి ఉంది. ప్రభాస్ హెయిర్ స్టైలిస్టుకి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ రాధే శ్యామ్ కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాక అన్ని భాషల ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూస్తున్నారు.

పిరియాడికల్ లవ్ స్టోరీ

పిరియాడికల్ లవ్ స్టోరీ

పిరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది జూలై 30న విడుదలకు సిద్ధమవుతోంది. రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న ఈ 'రాధే శ్యామ్' సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి ప్రేమకథగా ఈ సినిమా స్టోరీ గురించి ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu
ఆమెను ప్రశంసిస్తూనే ప్రభాస్

ఆమెను ప్రశంసిస్తూనే ప్రభాస్

తాజాగా ప్రభాస్ మరికొందరు టీమ్ సభ్యులతో కలిసి ఇటీవల రాధే శ్యామ్ కాపీని చూశారని తెలుస్తోంది. అయితే సినిమాలో అన్నిటికంటే పూజా పెర్ఫామెన్స్ ఆయనని కట్టి పడేసిందని అంటున్నారు. అందుకే సినిమా చూస్తున్నంత సేపు, చూసిన తర్వాత కూడా ఆయన పూజాను ప్రశంసిస్తూ ఉన్నాడట. ఆమె నటన ఎంత అద్భుతంగా ఉందో, ఆమె ఉన్న సన్నివేశాలు ఎంత చక్కగా కుదిరాయో ప్రభాస్ టీం కూడా అబ్బురపడిందని అంటున్నారు. రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేయడానికి ఇంకా ఒక పాట మాత్రమే మిగిలి ఉంది. లాక్డౌన్ ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసిన తర్వాత పెండింగ్‌లో ఉన్న పాట షూట్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X