For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుజిత్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రభాస్.. ‘సాహో’ ఫ్లాప్ అయినా నష్టం లేకుండా ప్లాన్.!

|
Prabhas Gave A Bumper Offer To Saaho Director Sujeeth !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ 'సాహో' ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కాడు.

టాక్ బాగోకున్నా కలెక్షన్లు మాత్రం భారీగా

టాక్ బాగోకున్నా కలెక్షన్లు మాత్రం భారీగా

సాహోకు ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. ఈ సినిమాను కొందరు బాగుందని అంటుండగా, మరికొందరు మాత్రం బాలేదని అంటున్నారు. దీంతో మిశ్రమ స్పందనే ఈ చిత్రం పరిమితమైంది. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతోంది.

నాలుగు రోజులకే ట్రిపుల్ సెంచరీ

నాలుగు రోజులకే ట్రిపుల్ సెంచరీ

మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. అలాగే నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్ల మార్కును దాటేసింది. ఈ విషయాన్ని ‘సాహో' నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది.

 ఐదు రోజుల కలెక్షన్లు

ఐదు రోజుల కలెక్షన్లు

మూడు రోజుల వీకెండ్‌లో భారీ వసూళ్లను రాబట్టిన ‘సాహో'.. వినాయక చవితి రోజు కూడా మంచి వసూళ్లనే సాధించింది. ఇక, మంగళవారం ఈ సినిమాపై స్పందన ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఆరోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టిందీ సినిమా. దీంతో ఐదు రోజుల్లో ‘సాహో' రూ. 350 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టర్స్ విడుదల చేసింది.

 ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘సాహో'

ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ‘సాహో'

ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో' 2019 సంవత్సరానికి గానూ ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోని బడా హీరోల రికార్డులు బద్దలు కొట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 350 కోట్లు వసూళు చేయడంతో.. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కబీర్ సింగ్ రికార్డులు కనుమరుగైపోయాయి. అంతకుముందు కబీర్ సింగ్ రూ. 278 కోట్లు కలెక్ట్ చేయగా, సల్మాన్ ఖాన్ భారత్ రూ. 211 కోట్లు, అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ రూ. 188 కోట్లు వసూలు చేశాయి. వీటిని ఇప్పుడు సాహో అధిగమించింది.

సుజిత్‌కు ప్రభాస్ ఆఫర్

సుజిత్‌కు ప్రభాస్ ఆఫర్

‘సాహో' డైరెక్టర్ సుజిత్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. రెండో సినిమానే అయినా దీనిని భారీ రేంజ్‌లో తీసిన ఈ యంగ్ డైరెక్టర్‌కు ప్రభాస్ అభయం ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అయితే తనకు ఎన్నో ఆఫర్లు వస్తాయి కానీ, ఒకవేళ ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అని సుజిత్.. ప్రభాస్‌తో అన్నాడట. దీనికి యంగ్ రెబెల్ స్టార్.. ‘సినిమా హిట్ అయితే నువ్వు స్టార్ డైరెక్టర్ అయిపోతావు. ఒకవేళ ఫ్లాప్ అయి నీకు ఆఫర్లు రాకపోతే నేనే మళ్లీ సినిమా చేస్తా' అని హామీ ఇచ్చాడని సమాచారం.

సాహో గురించి

సాహో గురించి

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.

English summary
Saaho, starring Prabhas and Shraddha Kapoor, went on to record the best Sunday of the year 2019 despite negative reviews. The film collected around Rs 29-30 crore on third day taking its total to around Rs 79 crore.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more