ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభాస్!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి' సెకండ్‌ఇన్ స్టాల్మెంట్ షూటింగులో బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు బాహబలి షూటింగులో పాల్గొంటూనే తన తర్వాతి సినిమాలకు కథలు వింటున్నాడు. స్క్రిప్టు నచ్చిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తున్నాడు.
బాహుబలి-2 తర్వాత ప్రభాస్ చేయబోయే ప్రాజెక్టు ఆల్రెడీ ఫిక్స్ అయింది. సుజిత్ సింగ్ దర్శకత్వంలో ప్రభాస్ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సుజిత్ తో సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమాకు కూడా కమిట్ అయినట్లు సమాచారం. ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టెనర్ గా ఉంటుందని తెలుస్తోంది. గతంలో 'జిల్' లాంటి ప్లాప్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. ఓ ప్లాప్ డైరెక్టర్ తో ప్రభాస్ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టెనర్ కమిట్ అవుతాడని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. అయితే రాధాకృష్ణ చెప్పిన స్క్రిప్టు ఆసక్తికరంగా ఉండటంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక ప్రభాస్ నటిస్తున్న 'బాహుబలి-2' సినిమా విషయానికొస్తే... ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. 2016 లోనే పార్ట్ 2 విడుదల కావాల్సిన ఉన్న షూటింగ్ షెడ్యూల్ అనుకున్న సమయానికి మొదలు కాక పోవడంతో వాయిదా పడింది. 2017లోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసారు. తాజాగా బాహుబలి-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











